కమర్షియల్‌ డైరెక్టర్‌తో ఆకాష్‌ మురళి

19 Apr, 2021 08:40 IST|Sakshi

తమిళ తెరకు మరో వారసుడు కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన పేరు ఆకాష్‌ మురళి. దివంగత నటుడు మురళి రెండవ కుమారుడు, యువ నటుడు అధర్వ సోదరుడే ఈ ఆకాష్‌ మురళి. కాగా, ఇంతకుముందు నటుడు విజయ్‌ కథానాయకుడిగా మాస్టర్‌ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన ఎక్స్‌ బి ఫిలిమ్స్‌ క్రియేటర్స్‌ సంస్థ తాజాగా నిర్మిస్తున్న చిత్రం ద్వారా ఆకాశ మురళి కథానాయకుడిగా పరిచయమవుతున్నారు. దీనికి విష్ణువర్దన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కోలీవుడ్లో కమర్షియల్‌ దర్శకుల్లో ఈయన ఒకరు. చాలా గ్యాప్‌ తర్వాత ఈయన తమిళంలో ఆకాష్‌ మురళి కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. 

మరిన్ని వార్తలు