Athena Inkem Kavali Movie: కామెడీ, లవ్, సెంటిమెంట్‌గా... అంతేనా.. ఇంకేం   కావాలి’

5 Jul, 2022 09:31 IST|Sakshi

పవన్‌ కల్యాణ్‌ బయ్యా, జాన్వీ శర్మ జంటగా వెంకట నరసింహ రాజ్‌ దర్శకత్వంలో ‘అంతేనా.. ఇంకేం   కావాలి’ సినిమా తెరకెక్కుతోంది. శ్రీ వెంకటలక్ష్మీ నరసింహ ప్రొడక్షన్‌పై రవీంద్ర బాబు నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో, హీరోయిన్‌లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నటుడు దగ్గుపాటి అభిరామ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, సీనియర్‌ నటుడు మురళీమోహన్‌ క్లాప్‌ ఇచ్చారు.

నటుడు ‘ఘర్షణ’ శ్రీనివాస్‌ స్క్రిప్ట్‌ని చిత్రయూనిట్‌కి అందించారు. వెంకట నరసింహ రాజ్‌ మాట్లాడుతూ– ‘‘ఇదే బ్యానర్‌లో ప్రస్తుతం నా దర్శకత్వంలో ‘అల్లుడు బంగారం’ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ‘అంతేనా.. ఇంకేం కావాలి’ నా రెండవ సినిమా. అమ్మకిచ్చిన మాటను, అమ్మాయికిచ్చిన మాటను హీరో ఎలా నెరవేర్చుకొన్నాడు? అనేదే ఈ చిత్రకథ’’ అన్నారు. ‘‘కామెడీ, లవ్, సెంటిమెంట్‌.. ఇలా అన్ని అంశాలతో ఈ సినిమా రూపొందుతోంది’’ అని రవీంద్ర బాబు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: పి.ఆర్‌. చందర్‌ రావ్‌.      

మరిన్ని వార్తలు