Athiya Shetty and KL Rahul: అతియా శెట్టి- కేఎల్ ‍రాహుల్ వెడ్డింగ్.. తేదీలు ఇవే..!

13 Dec, 2022 13:15 IST|Sakshi

ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్‌ శెట్టి ముద్దుల కూతురు అతియా శెట్టి, టీంఇండియా ఓపెనర్ కేఎల్‌ రాహుల్ కొన్నేళ్లుగా డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. మూడేళ్లుగా సీక్రెట్‌ డేటింగ్‌లో ఉన్న జంట ఈ ఏడాదే వారి రిలేషన్‌ను ఆఫిషియల్‌గా సోషల్ మీడియాలో ప్రకటించారు. తాజాగా ఈ జంట పెళ్లి తేదీలపై క్లారిటీ వచ్చేసింది. వచ్చే ఏడాది జనవరి నెలలోనే వీరు ఒక్కటవబోతున్నట్లు తెలుస్తోంది. 

(ఇది చదవండి: కేఎల్ రాహుల్, అతియా శెట్టి పెళ్లి.. ఎప్పుడో సునీల్ శెట్టి చెప్పేశాడుగా..!)

అతియా  శెట్టి, కేఎల్ రాహుల్ ఓ విలాసవంతమైన వేదికను ఖరారు చేసినట్లు సమాచారం. జనవరి 21,22, 23 తేదీల్లో హల్దీ, మెహెందీ, సంగీత్, గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకలకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఖండాలా ఫామ్‌హౌస్ - జహాన్‌లో దక్షిణ-భారత సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరగనుంది. ఇరువురి కుటుంబ సభ్యులు డిసెంబర్ చివరి నాటికి వివాహ ఆహ్వానాలను పంపనున్నట్లు సమాచారం. 

కాగా.. నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించిన సూరజ్ పంచోలీతో కలిసి 2015లో రొమాంటిక్ యాక్షన్ చిత్రం ‘హీరో’ సినిమాతో అతియా శెట్టి ఎంట్రీ ఇచ్చింది. ఆమె చివరి సారిగా ‘మోతీచూర్ చక్నాచూర్’ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన నటించింది. ఫుట్‌బాల్ క్రీడాకారుడు అఫ్షాన్ ఆషిక్ బయోపిక్ ‘హోప్ సోలో’లో ఆమె ప్రధాన పాత్రలో నటించనుంది. 

మరిన్ని వార్తలు