జెట్‌ స్పీడ్‌

30 Nov, 2020 06:30 IST|Sakshi

ధనుష్, అక్షయ్‌ కుమార్, సారా అలీఖాన్‌ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘అత్రంగీ రే’. ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ముక్కోణపు ప్రేమకథగా ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ నార్త్‌ ఇండియాలో జరుగుతోంది. ధనుష్, సారా అలీ ఖాన్‌లపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌తో ఈ సినిమాలో ధనుష్‌ పాత్ర చిత్రీకరణ పూర్తవుతుందని తెలిసింది. లాక్‌డౌన్‌ తర్వాతే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించారు ధనుష్‌. అప్పుడే జెట్‌స్పీడ్‌లో తన పాత్రని పూర్తి చేస్తున్నారాయన. ఈ సినిమాలో ధనుష్‌ ఓ పాట కూడా పాడటం విశేషం. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు