David Warner Tweet On Pushpa: పుష్ప గెటప్‌లో డేవిడ్ వార్నర్.. ట్వీట్ వైరల్

10 Oct, 2022 19:30 IST|Sakshi

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్‌ వార్నర్ పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్‌ సినిమా పాటలకు తన స్టెప్పులతో అభిమానులను అలరిస్తుంటాడు. ఐపీఎల్ టీం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో అతనికున్న అనుబంధం వల్ల తెలుగు రాష్ట్రాల్లోనూ అతనికి ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా డేవిడ్ వార్నర్ చేసిన ఓ ట్వీట్ వైరలవుతోంది. అంతలా వైరలవుతున్న ట్వీట్‌లో ఇంతకీ ఏముందో ఓ లుక్కేద్దాం. 

తాజాగా ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మూవీ 'పుష్ప' క్లీన్‌ స్వీప్ చేయడంతో డేవిడ్ వార్నర్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 'ఫిల్మ్ ఫేర్ అవార్డులకు అల్లు అర్జున్ పుష్ప ఎంపికవ్వడం సంతోషం. ఈ సినిమా అంటే మాకు చాలా ఇష్టం. ఈ చిత్రంలో భాగమైన అందరికీ అభినందనలు' అంటూ పుష్ప గెటప్‌లో వార్నర్‌ ఉన్న ఫోటోను షేర్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 

మరిన్ని వార్తలు