చిన్న సినిమా.. ‍కానీ నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్!

20 Nov, 2023 16:51 IST|Sakshi

కాళిదాస్‌ జయరాం హీరోగా నటించిన మూవీ 'అవళ్‌ పేర్‌ రజినీ'. తమిళ, మలయాళ భాషల్లో తీసిన ఈ చిత్రాన్ని నవరస ఫిలిమ్స్‌ పతాకంపై శ్రీజిత్‌ కేఎస్‌, జెస్సీ శ్రీజిత్‌ నిర్మించారు. వినీల్‌ స్కరియా వర్గీస్‌ దర్శకత్వం వహించగా.. నమిత ప్రమోద్‌, రెబా మోనికా జాన్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. నలుగురు సంగీత దర్శకులు పని చేసిన ఈ మూవీకి పనిచేయడం విశేషం. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు)

ఈ చిత్ర ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్ తాజాగా చెన్నైలో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా 'లియో' డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ వచ్చారు. ట్రైలర్‌ బాగుందని, చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నట్లు లోకేశ్ చెప్పకొచ్చాడు.

హీరో కాళిదాస్‌ జయరామ్‌ మాట్లాడుతూ.. ఇదే వేదికపైకి కమలహాసన్‌ తనని చేయిపట్టుకుని తీసుకొచ్చి పరిచయం చేశారని అన్నాడు. 'విక్రమ్'లో అవకాశమిచ్చినందుకు డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌కి ధన్యవాదాలు చెప్పాడు. కొత్త మూవీలో తాను ఇప్పటి వరకు చేయని పాత్రను ఇందులో పోషించినట్లు కాళిదాస్ చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి ఆ తెలుగు సినిమా!)

మరిన్ని వార్తలు