ట్రైలర్‌ చాలా బాగుంది

24 Aug, 2020 01:45 IST|Sakshi

- నాగబాబు

‘‘అవలంబిక’ ట్రైలర్‌ చాలా బాగుంది. రాజశేఖర్‌ చాలా కష్టపడి ఈ సినిమాని చేశాడని తెలుస్తోంది. యువ ప్రతిభావంతుల్ని ప్రోత్సహించడంలో మెగా ఫ్యామిలీ ఎప్పుడూ ముందుంటుంది. నిర్మాత ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాని నిర్మించారు’ అని నటుడు, నిర్మాత నాగబాబు అన్నారు. సుజయ్, అర్చన (వేద) జంటగా రాజశేఖర్‌ (రాజ్‌) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అవలంబిక’.

శ్రీ షిరిడీ సాయి ప్రొడక్ష¯Œ ్స పతాకంపై జి.శ్రీనివాస్‌ గౌడ్‌ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని నాగబాబు విడుదల చేశారు. ‘‘ఈ సినిమాని భారీ గ్రాఫిక్స్‌తో చిత్రీకరించాం. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాం’’ అన్నారు రాజశేఖర్‌. ‘‘ఖర్చుకు వెనకాడకుండా గ్రాండ్‌గా ఈ చిత్రం నిర్మించాం’’ అని శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో సుజయ్‌ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వెంకీ పెద్దాడ, సంగీతం: ఉదయ్‌ కిరణ్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు