అవసరాల శ్రీనివాస్‌ బట్టతల వీడియో‌.. అసలు విషయం ఇదే!

25 Mar, 2021 20:01 IST|Sakshi

రెండు రోజుల నుంచి నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్‌కు సంబంధించిన ఓ షాకింగ్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతున్న విషయం తెలిసిందే. అతని దగ్గర మూడేళ్లుగా పనిచేస్తున్న కోడైరెక్టర్‌ మహేశ్‌ ఓ వీడియో బయటపెట్టడం చర్చనీయాంశంగా మారింది. అవసరాల శ్రీనివాస్‌కు మహేశ్‌ మధ్య గొడవలు రావడంతో అతన్ని తిట్టి ఆఫీస్‌ నుంచి బయటకు పంపించేశాడు. దీంతో శ్రీనివాస్‌పై కక్ష పెంచుకున్న మహేశ్‌.. అతని ఆఫీస్‌కి వెళ్లి నానా హంగామా చేశాడు.

అవసరాల నిజస్వరూపాన్ని అందరికీ చూపిస్తానంటూ.. ఫొటో షూట్ చేయించుకుంటున్న అవసరాల దగ్గరకు వెళ్లి, నన్నెందుకు తిట్టావ్ అని ప్రశ్నిస్తూ వీడియో రికార్డింగ్ చేశాడు. వీడియో బయటకెళ్తే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని అవసరాల శ్రీనివాస్, మహేష్ కు వార్నింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే మహేష్ ఫొటో షూట్ చేయించుకుంటున్న అవసరాల శ్రీనివాస్ క్యాప్‌ను తీసేయగా.. అతను బట్టతలతో కనిపించడం నెటిజన్లకు షాక్ ఇచ్చింది.

అయితే ఈ వీడియో చూసి ఎంతో మంది షాక్‌కు గురవ్వగా.. కొంతమంది సందేహం వ్యక్తం చేశారు. ఇది నిజంగానే జరిగిందా లేక సినిమా ప్రమోషన్‌ కోసమా అనే కన్‌ఫ్యూజన్‌లో ఉండిపోయారు. తాజాగా, ఆ సందేహాలే నిజమనేలా అవసరాలకు సంబంధించిన ఓ అప్‌డేట్‌ వచ్చింది. అవసరాల శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న చిత్రం.. ‘నూటొక్క జిల్లాల‌ అంద‌గాడు’. ఈ సినిమా పోస్టర్‌ను తాజాగా విడుదల చేసింది చిత్రయూనిట్‌. త్వరలో టీజర్‌ రిలీజ్‌ చేస్తున్నట్లు పేర్కొన్న ఈ పోస్టర్‌ను చూసిన ఎవరికైనా బట్టతల వీడియోపై స్పష్టత వచ్చేస్తుంది. ఇందులో రెండు విభన్నగెటప్‌లో ఉన్న అవసరాల శ్రీనివాస్‌.. ఒక ఫ్రేమ్‌లో పూర్తి జుట్టుతో చేతిలో బట్టతలతో ఉన్న బొమ్మను పట్టుకొని ఉండగా. మరోపక్క బట్టతలతో ఉండి చేతిలో జుట్టున్న బొమ్మను పట్టుకొని కనిపిస్తు‍న్నాడు. 

దీంతో బట్టతల వీడియో సినిమా ప్రమోషన్‌కు అని తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో అవసరాల గొత్తి సూర్యనారాయణగా అలరించనున్నాడు. వైవిధ్య‌మైన క‌థాంశంతో ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు తానే స్వయంగా కథ రాసుకున్నాడు. చి.ల.సౌ ఫేమ్‌ రుహనీ శర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా.. దిల్‌ రాజు నిర్మిస్తున్నాడు. రామ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి స్వీకార్ అగ‌స్తి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను త్వరలోనే విడుదల చేసేందుకు నిర్మాత దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నారు.

చదవండి: షాకింగ్‌ వీడియో.. అవసరాల శ్రీనివాస్ గుట్టు రట్టు!
తను నాతో ఎక్కువ టైం ఉండట్లేదు..: కాజల్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు