షాకింగ్‌ వీడియో.. అవసరాల శ్రీనివాస్ గుట్టు రట్టు!

24 Mar, 2021 16:23 IST|Sakshi

నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్‌కు సంబంధించిన ఓ షాకింగ్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అతని దగ్గర మూడేళ్లుగా పనిచేస్తున్న కోడైరెక్టర్‌ మహేశ్‌ ఈ వీడియో బయటపెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మహేశ్‌కి శ్రీనివాస్‌కి మధ్య  గొడవలు రావడంతో అతన్ని తిట్టి ఆఫీస్‌ నుంచి గెంటేశాడు. దీంతో కక్ష పెంచుకున్న మహేశ్‌.. శ్రీనివాస్‌ ఆఫీస్‌కి వెళ్లి రచ్చ రచ్చ చేశాడు. అవసరాల శ్రీనివాస్‌ నిజస్వరూపం బయటపెడతానంటూ అతని ఒరిజినల్‌‌ ఫేస్‌ చూపించి షాకిచ్చాడు. సినిమాల్లో ఉంగరాల జట్టుతో అందంగా కనిపించే శ్రీనివాస్‌కు బట్టతల ఉంది. ఈ విషయాన్ని మహేశ్‌ బహిర్గతం చేసే వరకు ఎవరికీ తెలియదు.

వీడియోలో మహేశ్‌ ఏమన్నారంటే.. ‘అందరికీ ఒక విషయం చెప్పాలని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా.. ఇండస్ట్రీలో అవసరాల శ్రీనివాస్ అనే ఆర్టిస్ట్ కమ్ డైరెక్టర్ ఉన్నాడుగా.. అతని దగ్గర నేను గత మూడేళ్లుగా పనిచేస్తున్నాను. నేను ఎలాంటి తప్పు చేయకపోయినా.. ఈరోజు నన్ను అందరి ముందు నిలబెట్టి తిట్టి ఆఫీస్ నుంచి బయటకు పంపించేశాడు. ఒక్క రీజన్ కూడా లేదు. అతని నిజస్వరూపం మీకు చూపిస్తా చూడండి’ అంటూ ఫోటో షూట్‌లో ఉన్న శ్రీనివాస్‌ దగ్గరకు వెళ్లి తలపై ఉన్న క్యాప్‌ని బలవంతంగా తీసేశాడు.

క్యాప్‌ తీయడంతో శ్రీనివాస్‌ బట్టతల బయటపడింది. దీంతో ఆగ్రహానికి లోనైన శ్రీనివాస్‌.. మహేశ్‌ని బూతులు తిడుతూ.. ఈ వీడియో బయటకు వెళ్తే.. నిన్ను ఇండస్ట్రీలో లేకుండా చేస్తా అంటూ బెదిరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇది సినిమా ప్రమోషన్‌ కోసమే చేసి ఉండొచ్చని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 

చదవండి:
అల్లు అర్జున్‌ కొత్త బిజినెస్‌: మహేష్‌కు పోటీగా!

చాన్స్‌ కోసం నిర్మాత గదిలోకి వెళ్లమన్నారు: నటి‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు