Avatar 2 Trailer Review: ‘అవతార్‌-2’లో ఏం ఉంది? సినిమా ఎలా ఉండబోతుంది?

5 Nov, 2022 12:28 IST|Sakshi

‘అవతార్’ చిత్రంలో పండోరా గ్రహాన్ని సృష్టించి, సరికొత్త  ప్రకృతి అందాలను తెరపై ఆవిష్కరించారు దర్శకుడు జేమ్స్ కామెరూన్. ఆ చిత్రాన్ని ప్రపంచ సినీ అభిమానులు మర్చిపోలేరు. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్స్ రెడీ అయింది. డిసెంబర్‌ 16న అవతార్‌ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ విడుదలైంది.

‘అవతార్‌-ది వే ఆఫ్ వాటర్' ఎలా ఉండబోతుందో ట్రైలర్‌ ద్వారా హింట్‌ ఇచ్చాడు డైరెక్టర్‌ జేమ్స్‌ కామెరూన్‌. మొదటి భాగంలోలాగే ఈ చిత్రంలో కూడా జేక్‌ సల్లీ, నేత్రిలు ‘పండోరా’ప్రపంచాన్ని కాపాడుకోవడానికి మనుషులతో పోరాటం చేస్తారని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. అయితే ఇది నీటి అడుగున జరిగే కథ. మొదటి సినిమా లాగే, ఈ చిత్రంలో కూడా జేక్ సల్లీ, నేత్రి తమ ప్రపంచమైన పండోరాను కాపాడుకునే పోరాటం చేస్తారని తెలుస్తోంది. 

మొదటి భాగం చివరల్లో నేత్రి గర్భవతి అని హింట్‌ ఇచ్చాడు. ఈ చిత్రం ట్రైలర్‌లో గర్భవతిగా నేత్రిని చూపించారు. జేక్‌, ఆయన భార్య నేత్రి, పిల్లలు ...వీరంతా కలిసి పండోరా ప్రపంచానికి కాపాడుకోవడానికి సాహసాలు చేస్తారు. అవతార్‌ పార్ట్‌-1లో పండోరా గ్రహం మీద పనిచేసిన రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఆర్డీఏ).. సెకండ్‌ పార్ట్‌లో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సారి కొత్త రకమైన రోబోటిక్‌ మిషిన్స్‌తో ఆర్డీఏ నావి తెగ మీద అధికారాన్ని చెలాయించాలని చూస్తుంది.

ట్రైలర్‌ని గమనిస్తే..ఒక షాట్‌లో నావీ తెగకు చెందినవారిని ఆర్డీఏ బంధించినట్లు, వారి ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కనిపిస్తుంది. వీరిని ఎదిరించడానికి హీరో జేక్‌ సల్లీ.. మెట్‌ కానియా తెగ సహాయం తీసుకుంటాడు. మరి మెట్‌ కానియా తెగ ఎలాంటి సాయం అందించిందో సినిమాలోనే చూడాలి. అలాగే అవతార్‌-2లో ఒక టీనేజ్‌ రొమాంటిక్‌ లవ్‌స్టోరీని కూడా చూపించబోతున్నారు.  

ట్రైలర్‌లో జేక్‌ సెల్లి కొడుకు మరో తెగకు చెందిన అమ్మాయితో మాట్లాడుతూ.. ‘ఎవరూ నన్ను అర్ధం చేసుకోవట్లేదు’ అంటే.. ‘నేను అర్థం చేసుకుంటాను’అని ఆ అమ్మాయి చెబుతుంది. అంటే వీరిద్ద మధ్య ఓ లవ్‌స్టోరిని నడిపించబోతున్నట్లు అర్థమవుతుంది.

పండోరాలోని మరిన్ని వింతలు, అద్భుతాలు, అక్కడి మనుషుల అమోఘమైన సాహసాలతో అవతార్-2 అద్భుతంగా రూపొందించినట్లు టీజర్‌, ట్రైలర్‌ చూస్తే అర్థమవుతంది. మరి ఈ చిత్రం ఎన్ని రికార్డులను క్రియేట్‌ చేస్తుందో డిసెంబర్‌ 16 తర్వాత తెలుస్తుంది.

మరిన్ని వార్తలు