కరోనా బారిన నా ఫ్యామిలీ, భయమేసింది: అవికా గోర్‌

28 Apr, 2021 14:18 IST|Sakshi

అవికా గోర్‌.. చిన్నారి పెళ్లికూతురుగా చాలామందికి ఆమె చిన్నప్పటి నుంచే పరిచయం.. బాలనటిగా కెరీర్‌ ప్రారంభించిన అవికా తర్వాత సినిమాల్లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఇండస్ట్రీలో బిజీగా ఉన్న ఈ భామ ఆ మధ్య తన ప్రియుడిని సైతం పరిచేసింది. మిలింద్‌ చంద్వానీతో ప్రేమలో ఉన్నానని, కానీ ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోమని తేల్చి చెప్పింది. ఇదిలా వుంటే అవికా కరోనా విజృంభణను చూసి భయపడిపోతోంది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో సుదీర్ఘ లేఖను షేర్‌ చేసింది.

"బయట పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం కరోనా వల్ల దాదాపు 2 లక్షల మంది చనిపోయారు. కానీ ఈ సంఖ్య నాలుగైదు రెట్లు ఎక్కువే ఉండి ఉంటుంది.  17 మిలియన్ల మంది వైరస్‌ బారిన పడ్డారు. వారిలో చాలామంది భవిష్యత్తులోనూ అనారోగ్యంతో బాధపడే అవకాశం ఉంది. ఈ కరోనాను డీల్‌ చేయడం వైద్యారోగ్య విభాగానికి తలకు మించిన భారంగా మారింది. కాబట్టి ఈ వైరస్‌ను నియంత్రించేందుకు మనం చేయగలిగేదంతా చేద్దాం..

నా కుటుంబం కూడా దీనితో పోరాడింది. నాకు చాలా భయమేసింది. కానీ ఈ పోరాటంలో వాళ్లు విజయం సాధించారు. కానీ ఎవరికీ ఇలాంటి పరిస్థితులు రావద్దు. కరోనాను జయించిన వాళ్లు దయచేసి ప్లాస్మాదానానికి ముందుకు రండి. అందరూ వ్యాక్సిన్‌ వేయించుకోండి. ఇది మిమ్మల్ని వైరస్‌ బారిన పడకుండా ఆపలేదు కావచ్చు, కానీ అది మీకు చేసే హానిని తగ్గిస్తుంది.

A post shared by Avika Gor (@avikagor)

మిమ్మల్ని వేడుకుంటున్నాను... అత్యవసరమైతేనే కాలు బయట పెట్టండి, ఇంట్లోనే ఉండండి. మనందరం ఏకమై దానితో పోరాడుదాం. ఇప్పటికే ఒకసారి జయించాం. మరోసారి గెలుస్తామన్న నమ్మకం కూడా ఉంది. నేను మీకు మాటిస్తున్నా.. కరోనా నుంచి విముక్తి కోసం నాకు చేతనైనంత కృషి చేస్తాను" అని అవికా గోర్‌ చెప్పుకొచ్చింది.

చదవండి: ప్రియుడిని ప‌రిచ‌యం చేసిన అవికా గోర్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు