పెళ్లికి సిద్దం, అతడు ఎప్పుడంటే అప్పుడే: హీరోయిన్‌

20 May, 2021 21:15 IST|Sakshi

'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది నటి అవికా గోర్‌. తెలుగులో 'ఉయ్యాల జంపాల' మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'లక్ష్మీ రావే మా ఇంటికి', 'సినిమా చూపిస్త మావ', 'ఎక్కడికి పోతావు చిన్నవాడ' వంటి పలు సినిమాల్లోనూ నటించి హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అవికాకు ప్రస్తుతం. తెలుగులో సినిమాలు అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో బాలీవుడ్‌కు మాకాం మార్చిన ఈ భామ ఇటీవల హిందీలో కాదిల్‌ అనే ప్రైవేట్‌ సాంగ్‌లో నటుడు ఆదిల్‌ ఖాన్‌ సరసన ఆడిపాడింది. ఈ నేపథ్యంలో వరుస ఆఫర్లు దక్కించుకుంటున్న ఆమె త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమైంట.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న అవికా తన ప్రేమ, పెళ్లి విషయమై నోరు విప్పింది. కొంతకాలంగా ఆమె హైదరాబాద్‌కు చెందిన మిలింద్‌ చంద్వానీతో ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె గతేడాది సోషల్‌ మీడియాలో అధికారికంగా వెల్లడించింది. హిందీలో రోడీస్‌ 17 కంటెస్టెంట్‌ వచ్చిన మిలింద్‌ ఓ ఎన్‌జీవో సంస్థను నడుపుతున్నాడు. ఈ క్రమంలో ఓ ఎన్జీవో కార్యక్రమంలో పాల్గోన్న అప్పుడే వీరిద్దరూ ప్రేమలో పడినట్లు ఆమె తెలిపింది. ఈ సందర్భంగా అవికా మాట్లాడుతూ.. ‘నేను మిలింద్‌ను హైదరాబాద్‌లో కలుసుకున్నాను. ఓ ఎన్జీవో కోసం పనిచేస్తున్న క్రమంలో అక్కడే ఫస్ట్‌టైం చూశాను. తొలిచూపులోనే అతడికి ఇంప్రెస్‌ అయ్యా.

అయితే మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ కాదు. ఒకరిని గురించి ఒకరం పూర్తిగా అర్థం చేసుకున్నాకే మా ప్రేమను వ్యక్తం చేసుకున్నాం. చెప్పాలంటే దక్షిణాది సినిమాల ప్రేమకథలా ఉంటుంది మా లవ్‌స్టోరీ’ అంటు చెప్పుకొచ్చింది. ఇక పెళ్లి ఎప్పుడని హోస్ట్‌ అడగ్గా.. ‘ఇప్పుడే నాది పెళ్లి వయసు కాదు. కానీ మిలింద్‌ చేసుకుందామని అడిగితే దానికి నేను రెడీగా ఉన్నాను. తను రేపే పెళ్లి చేసుకుందామన్నా కూడా అందుకు నేను సిద్దం’ అని అవికా పేర్కొంది. అంతేగాక మిలింద్‌ పెళ్లి చేసుకునేందుకు సిద్దంగా ఉన్నాడని అతడు ఏ క్షణానైనా అడిగేలా ఉన్నాడంటు ఆమె చమత్కరించింది. ఇదంతా చూస్తుంటే అవికా త్వరలోనే పెళ్లి పీటల ఎక్కనున్నట్లు కనిపిస్తోంది. 

A post shared by Avika Gor (@avikagor)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు