వాళ్ల 'పవర్' మీదే సౌత్ ఇండస్ట్రీ ఉంది, తెలుగు ఇండస్ట్రీపై హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు

12 Jun, 2023 16:10 IST|Sakshi

ఉయ్యాలా జంపాలా చిత్రంతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది అవికా గోర్. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ చిత్రం 2014లో విడుదలై సూపర్ హిట్ కొట్టింది. ఈ చిత్రానికి హీరో నాగార్జున నిర్మాత కావడం మరింత కలిసొచ్చింది. మొదటి సినిమాతోనే మంచి క్రేజ్‌ సంపాదించుకున్న ఈ బ్యూటీ సినిమా చూపిస్త మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజు గారి గది 3 వంటి వరుస సినిమాలతో హీరోయిన్‌గా మరింత గుర్తింపు తెచ్చుకుంది.

ఈ ఏడాది ప్రారంభంలో పాప్ కార్న్ సినిమాతో సహ నిర్మాతగా పలకరించినా అది అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. తాజాగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న అవికా గోర్ సౌత్ సినిమా ఇండస్ట్రీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ కంటే సౌత్‌ ఇండస్ట్రీలోనే నెపోటిజం ఎక్కువగా ఉంటుందని నటి అవికా గోర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

(ఇదీ చదవండి:  50 ఏళ్ల వయసులో తండ్రినయ్యా.. నా జీవితం పరిపూర్ణమైంది)

'స్టార్ హీరోల పవర్ మీదే సౌత్ ఇండస్ట్రీ మొత్తం నడుస్తోంది. బాలీవుడ్‌ కంటే సౌత్‌లో నెపోటిజం కొంచెం ఎక్కువే..  హిందీ చిత్రాలపై అక్కడ పక్షపాతం ఉంది. సౌత్ సినిమాలు నేడు బాలీవుడ్‌లో చాలా రీమేక్ అవుతున్నాయి. వాటిని ఇక్కడి ప్రేక్షకులు కూడా ఎంజాయ్‌ చేస్తున్నారు. కానీ అక్కడి వారు మాత్రం బాలీవుడ్‌ చిత్రాలను పెద్దగా ఇష్టపడరు. తెలుగు ఇండస్ట్రీ విషయానికి వస్తే మొత్తం బంధుప్రీతితో నిండి ఉంది. ప్రజలు కూడా దానినే ఇష్టపడుతున్నారు.

రాబోయే రోజుల్లో ఇది ఉండకపోవచ్చు' అని తెలిపింది. అవికా గోర్‌ కామెంట్లపై నెటిజన్లు మండి పడుతున్నారు. సౌత్‌లో అవకాశాలు దక్కించుకొని, మంచి పేరుతో పాటు డబ్బు సంపాదించాక చులకన చేసి మాట్లాడం కరెక్ట్‌ కాదని ఫైర్‌ అవుతున్నారు. కాగా అవికా గోర్‌ ప్రస్తుతం 1920 హారర్ సినిమాకు సీక్వెల్‌గా వస్తోన్న '1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది ఈ బ్యూటీ.  తెలుగు, తమిళ, హిందీలో విడుదల కాబోతోంది. 

(ఇదీ చదవండి: సీనియర్‌ హీరోయిన్‌పై మనుసు పడిన రౌడీబాయ్‌)

మరిన్ని వార్తలు