'ఉమాపతి' సెన్సార్ కంప్లీట్.. డిసెంబర్ 29న థియేటర్లలో రిలీజ్

25 Dec, 2023 15:21 IST|Sakshi

ప్రేమ కథలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. మరీ ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో వచ్చే ఇలాంటి స్టోరీలు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. తాజాగా ఇలాంటి కాన్సెప్ట్‌తో తీసిన మూవీ 'ఉమాపతి'. అనురాగ్ హీరోగా, 'చిన్నారి పెళ్లికూతురు' ఫేమ్ అవికా గోర్ హీరోయిన్‌గా చేసింది. క్రిషి క్రియేషన్స్ బ్యానర్‌పై కే.కోటేశ్వరరావు నిర్మాతగా వ్యవహరించారు. సత్య ద్వారంపూడి దర్శకత్వం వహించారు. ఇప్పటికే పోస్టర్స్, పాటలు, టీజర్.. ఇలా అన్నీ పాజిటివ్ బజ్ సొంతం చేసుకున్నాయి. రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్ కూడా ఆకట్టుకుంటోంది.

(ఇదీ చదవండి: 'సలార్' వీకెండ్ కలెక్షన్స్.. ఏకంగా రూ.400 కోట్ల దాటేసి..!)

తాజాగా 'ఉమాపతి' మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. పూర్తి కుటుంబ సమేతంగా చూడదగ్గ అందమైన ప్రేమ కథా చిత్రమని సెన్సార్ సభ్యులు మెచ్చుకున్నారట. అలానే యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేశారు. డిసెంబర్ 29న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. శక్తికాంత్ కార్తీక్ సంగీతమందించగా.. చంద్రబోస్, భాస్కర భట్ల తదితరలు పాటలు రాశారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్)

>
మరిన్ని వార్తలు