‘రాకీ భాయ్’‌నే బోల్తా కొట్టించిన ఐరా..!

26 Oct, 2020 20:49 IST|Sakshi

బయట పని ఒత్తిడి, ఇబ్బందులు ఎన్ని ఉన్నా సరే.. ఇంటికి వచ్చి భార్యాబిడ్డల ముఖం చూస్తే చాలు అలసట ఎగిరిపోతుంది. ఇక పిల్లలతో గడిపితే ఆ రోజు కోల్పోయిన సంతోషం అంతా తిరిగి వస్తుంది. ఈ విషయంలో సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడా లేదు. కడుపు తీపి, పేగు బంధం అందరికి ఒకేలా ఉంటుంది కదా. ఇక ఇంట్లో ఐదేళ్లలోపు చిన్నారులు ఉంటే ఆ సందడే వేరు. వారి ముద్దు ముద్దు చేష్టలు, అ‍ల్లరితో ఇల్లంతా కళకళలాడుతూ ఉంటుంది. తాజాగా రాకీ భాయ్‌ యశ్‌ ఈ కోవకు చెందిన వీడియోను పోస్ట్‌ చేశారు. దీనిలో యశ్‌ తన కుమార్తెని ఐస్‌క్రీమ్‌ కోసం రిక్వెస్ట్‌ చేయడం చూడవచ్చు. ‘షేరింగ్‌ అనేది కేరింగ్‌లో భాగం.. కానీ ఐస్‌క్రీమ్‌ విషయంలో మాత్రం కాదు’ అంటూ షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవతోంది. (చదవండి: ‘నాన్నా.. ఇది సమ్మర్‌ అని నాకు తెలుసు)

Sharing is caring... not when it comes to ICE CREAM 😜 (Getting a dose of my own medicine here 😄)

A post shared by Yash (@thenameisyash) on

దీనిలో యష్‌, ఐరా డైనింగ్‌ టేబుల్‌ మీద కూర్చుని ఉంటారు. ఇక చిన్నారి ముందు ఐస్‌క్రీమ్‌ గిన్నె ఉంది. తనకు కొంచెం ఐస్‌క్రీమ్‌ పెట్టమని యశ్‌ కుమార్తెని అడిగి నోరు తెరుస్తాడు. దాంతో ఐరా ఐస్‌క్రీమ్‌ స్పూన్‌ని తండ్రి‌ నోటి దాకా తీసుకెళ్లి వెంటనే తన నోట్లో పెట్టుకుంటుంది. గిన్నెలో ఐస్‌క్రీమ్‌ అయిపోయేంత వరకు ఐరా ఇలానే చేస్తుంది. ఇక కూతురి అల్లరి చూసి యశ్‌ తెగ నవ్వుతాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇక లాక్‌డౌన్‌ కారణంగా గత ఆరు నెలలుగా స్టార్లందరు ఇంటికే పరిమితమయ్యారు. అనుకోకుండా దొరికిన బ్రేక్‌ టైంని కుటుంబంతో సరదాగా గడుపుతూ సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే కేజీఎఫ్‌ 2 షూటింగ్‌ జరుగుతుంది. వచ్చే ఏడాది సంక్రాతి కానుకగా చిత్రం విడుదల కానుంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా