ఆరేళ్లుగా ఆ వ్యాధితో బాధపడుతున్నా.. నరాలు తెగిపోయేలా చేసింది: హీరో

22 Nov, 2022 16:39 IST|Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆయుష్మాన్‌ ఖురానా తాజాగా ఓ షాకింగ్‌ విషయాన్ని బయటపెట్టాడు. గత ఆరేళ్లుగా తాను వెర్టిగో (తీవ్రమైన తలనొప్పి) సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడించాడు. సినిమాల్లోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సందర్భాల్లో ఈ సమస్య తనను ఎంతగా ఆందోళనకు గురిచేస్తుందని అన్నారు.

‘ఆరేళ్లుగా నేను వెర్టిగో సమస్యతో బాధపడుతున్నాను. నా కొత్త మూవీ (ఆన్‌ యాక్షన్‌ హీరో) లో ఎత్తైన భవనం నుంచి దూకే సీన్‌ ఉంటుంది. రక్షణ కోసం హార్నెస్‌ కేబుల్స్‌ ఉన్నప్పటికీ ఏదో జరుగుతుందని అమాంతం భయపడిపోయాను. ఆ బాధ నరాలు తెగిపోయేలా చేసింది’ అని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయుష్మాన్‌ చెప్పుకొచ్చాడు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆన్‌ యాక్షన్‌ హీరో అనే సినిమాలో నటిస్తున్నాడు ఆయుష్మాన్‌. అనిరుధ్‌ అయ్యర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతో పాటు డ్రీమ్‌గర్ల్‌2 సినిమాలో కూడా నటించబోతున్నాడు. 

‘వెర్టిగో’ లక్షణాలు

► వెర్టిగో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి రంగులరాట్నం మీద తిప్పి అక్కడినుంచి విసిరేసినట్లుగా ఉంటుంది
► తల తిరగడం
► పరిసరాలు తిరుగుతున్న ఫీలింగ్‌, బ్యాలెన్స్‌ కోల్పోవడం
► వికారం, వాంతులు
► చెమట ఎక్కువ పడుతుంది

మరిన్ని వార్తలు