ఆనందయ్య మందు: జగపతి బాబుపై బాబు గోగినేని సెటైర్లు

12 Jun, 2021 13:19 IST|Sakshi

ఒకపక్క కరోనాకు విరుగుడుగా, సంజీవనిగా ఆనందయ్య మందును లక్షలమంది భావిస్తుంటే.. మరోవైపు హేతువాది బాబు గోగినేని మొదటి నుంచి మందు శాస్త్రీయతపై వెటకారం ప్రదర్శిస్తూ వస్తున్నాడు. అయితే ఆనందయ్య మందుకు టాలీవుడ్‌ నటుడు జగపతి బాబు సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగపతి బాబును టార్గెట్‌ చేస్తూ బాబు గోగినేని వ్యంగ్యంగా ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేశాడు. 

‘అమ్మ నాటీ! తమరు దుకాణం తెరవబోతున్నట్టు చెప్పకుండా.. ఆనందయ్య చట్నీ గుణగణాలు మెచ్చుకుంటూ మాట్లాడటం భలే బిజినెస్ టాక్టిక్ యాక్టర్ గారూ.. కానీ తెలివైనవాడు ఎవడైనా కొంచెం ఆగి చెప్పేవాడు. ఈ ఆత్రం మనకే చేటు’ అంటూ జగపతిబాబుపై పోస్ట్‌ పెట్టారు బాబు గోగినేని. జగపతిబాబు ఆయుర్వేదం బిజినెస్‌లోకి అడుగుపెట్టబోతున్నారంటూ, జూబ్లిహిల్స్‌లో ఆస్పత్రి తెరవబోతున్నారంటూ ఓ లోకల్‌ ఇంగ్లీష్‌ వెబ్ సైట్‌లో వార్త వచ్చింది. ఆ వార్తను ఆధారంగా చేసుకుని ఇలా జగపతిబాబుపై సెటైర్లు వేశారు బాబు గోగినేని. మరి దీనిపై జగపతి బాబు ఎలా స్పందిస్తారో చూడాలి.

అయితే ఎవడు నమ్మినా.. నమ్మకపోయినా.. నేను నమ్ముతున్నా అంటూ గతంలో జగపతి బాబు ఆనందయ్య మందుకు సంపూర్ణ మద్దతు ప్రకటించాడు. ‘ఆయుర్వేదం అనేది తప్పు చేయదు.. శరీరానికి హానిచేయదు. ప్రకృతి, భూదేవి తప్పు చేయవు. ప్రజల్ని కాపాడటానికి ప్రకృతి ఆనందయ్య మందు రూపంలో మన ముందుకు వచ్చింది. ఈ ప్రపంచాన్ని కాపాడుతుంద‌ని ఆశిస్తున్నా.. ఆనందయ్యని దేవుడు ఆశీర్వదించాలి అంటూ ఈ సీనియర్‌ నటుడు వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు ఆనంద‌య్య గారి మందు శాస్త్రీయంగా అనుమ‌తి పొందుతుంద‌ని ఆశాభావం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. చదవండి: గుర్తుపెట్టుకోండి ఇది వార్నింగ్‌ మాత్రమే!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు