జై సియ రామ్‌.. ఆరాధ్య భక్తి పాట,ఆట

16 Nov, 2020 13:09 IST|Sakshi

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్‌, అభిషేక్‌ బచ్చన్ల ముద్దుల తనయ ఆరాధ్య బచ్చన్‌ పుట్టిన రోజు నేడు. సోమవారం 9వ పడిలోకి అడుగుపెట్టారు ఈ చిన్ని బచ్చన్‌. ఆరాధ్య తాత, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ 9వ పడి వరకు ప్రతీ ఏటా దిగిన ఫొటోలను ఓ చోట చేర్చి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ‘ఆరాధ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.. నా ప్రేమతో’ అనే శీర్షికను ఉంచారు. డైరెక్టర్‌తో స్టెప్పులేయించిన శ్రుతీ హాసన్‌ )

తన ట్విటర్‌ ఖాతాలో ఆరాధ్యకు సంబంధించిన ఓ వీడియో పోస్టును కూడా ఆయన షేర్‌ చేశారు. ఓ అభిమాని షేర్‌ చేసిన పోస్టును ఆయన రీట్వీట్‌ చేశారు. దీపావళి సందర్భంగా మనవరాలు దేవుడి పాట పాడుతున్న వీడియో అది. ‘జై సియ రామ్‌, జై జై సియ రామ్‌’ అంటూ పాడుతూ.. దానికి తగ్గట్టుగా చక్కడా ఆడింది.

మరిన్ని వార్తలు