Back Door: థియేటర్స్‌లోనే ‘బ్యాక్‌ డోర్‌’.. విడుదల ఎప్పుడంటే..?

11 Dec, 2021 16:31 IST|Sakshi

పూర్ణ ప్రధాన పాత్రలో తేజ త్రిపురాన హీరోగా నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'బ్యాక్ డోర్'.  కర్రి బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించారు. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు.. డిసెంబర్‌ 18న  ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది.  ఈ క్రేజీ చిత్రం వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులు సొంతం చేసుకున్న కె.ఆర్.ఫిల్మ్ ఇంటర్నేషనల్ అధినేత కందల కృష్ణారెడ్డి మాట్లాడుతూ..."బ్యాక్ డోర్" చిత్రానికి గల క్రేజ్ కి తగ్గట్టు... భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఈనెల 18న విడుదల చేస్తున్నాం. ఈనెల 15న భారీ స్థాయిలో ప్రి-రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం" అన్నారు. చిత్రానికి కో-డైరెక్టర్: భూపతిరాజు రామకృష్ణ,  సంగీతం: ప్రణవ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రవిశంకర్‌.

మరిన్ని వార్తలు