బాహుబలి, రేసుగుర్రం బాలనటుడు హీరోగా 'బ్యాచ్‌' మూవీ

28 May, 2021 09:39 IST|Sakshi

'బాహుబలి, రేసుగుర్రం, మళ్లీ రావా, దువ్వాడ జగన్నాథం, నా పేరు సూర్య' లాంటి చిత్రాల్లో బాలనటుడిగా నటించిన సాత్విక్‌ వర్మ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం బ్యాచ్‌. నేహా పఠాన్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. బేబీ ఆరాధ్య సమర్పణలో శివ దర్శకత్వంలో రమేష్‌ ఘనమజ్జి నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుపుకుంటోంది.

క్రికెట్‌ బెట్టింగ్‌ నేపథ్యంతో పాటు కాలేజీలో కుర్రాళ్ల కథే మా సినిమా అన్నారు శివ. మా సినిమాకు సంగీత దర్శకుడు కుంచె మరో హీరో అనే చెప్పుకోవాలి. ఈ చిత్రానికి సత్తిబాబు కసిరెడ్డి, అప్పారావు పంచాది సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

చదవండి: 'ప్రభాస్‌ అలా అనడం నా జీవితంలో మర్చిపోలేను'

మరిన్ని వార్తలు