రక్షాబంధన్ : సుశాంత్ సోదరి భావోద్వేగం

3 Aug, 2020 13:26 IST|Sakshi

జాన్..ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం : సుశాంత్ సోదరి

రక్షా బంధన్ సందర్భంగా  శ్వేతా సింగ్ కీర్తి  భావోద్వేగ పోస్ట్

సాక్షి, ముంబై: అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల  ప్రేమ బంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్‌ సందర్భంగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి భావోద్వేగ పోస్ట్ షేర్ చేశారు. శ్వేతాసింగ్ కీర్తి రాఖీ పర్వదినం సందర్భంగా తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాఖీ శుభాకాంక్షలు..నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం..నువ్వు ఎప్పటికి మాకు గర్వకారణమే అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా గత జ్ఞాపకాల ఫోటోలను షేర్ చేశారు.(సుశాంత్ కేసు : మరో వివాదం)

హ్యాపీ రక్షాబంధన్ మేరా స్వీట్ సా బేబీ...బహుత్ ప్యార్ కర్తే హై హమ్ ఆప్కో జాన్...ఔర్ హమేషా కర్తే రహెంగే...యూ వర్..ఆర్..యూ విల్..అవర్ ప్రైడ్ అంటూ శ్వేతా సింగ్ కీర్తి రాశారు. సోషల్ మీడియా ద్వారా సుశాంత్ సోదరి శ్వేతాతోపాటు మరో సోదరి నీతూ సింగ్ కూడా సుశాంత్ పై ప్రేమను వ్యక్తం చేశారు. గుల్షన్‌, నా బేబీ ..రక్షా బంధన్ రోజు నువ్వు లేకుండా ఎలా జీవించాలో అర్థం కావడం లేదు. నువ్వు శాశ్వతంగా దూరమైన రక్షా బంధన్ ఉంటుందని ఆలోచించలేదు. నువ్వు లేకుండా జీవించడం ఎలా నేర్చుకోవాలో నువ్వే చెప్పు అంటూ నీతూ సింగ్(రాణి దీ) పోస్ట్ చేశారు.  (సుశాంత్ మరణం : షాకింగ్ వీడియో)

కాగా జూన్ 14న సుశాంత్ ముంబైలోని బాంద్రా నివాసంలో ఉరికి వైలాడుతూ కనిపించిన సంగతి తెలిసిందే. సుశాంత్ మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నతరుణంలో రోజుకో కీలక పరిణామం వెలుగు చూస్తోంది. దీనిపై సీబీఐ దర్యాప్తు జరపాలంటూ పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు సుశాంత్ ఆత్మహత్యకు ప్రియురాలు రియా చక్రవర్తి కారణమంటూ సుశాంత్ తండ్రి  బిహార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రియాపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో బిహార్, మహారాష్ట్ర పోలీసుల మధ్య వివాదం రగులుతున్న సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా