'సిల్క్ స్మితను కొట్టే ఆడదే లేదు.. అది మూమూలు విషయం కాదు'

27 Jul, 2021 13:59 IST|Sakshi

Balakrishna About Silk Smitha : సిల్మ్‌ స్మిత..ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శృంగార తారగా స్టార్‌ డం తెచ్చుకున్న సిల్మ్‌ స్మిత రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్‌ హీరోలందరితో నటించారు. గ్లామర్‌ పాత్రలతో అలరించిన ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ సహా పలు భాషల్లో 450కి పైగా సినిమాల్లో నటించారు. అప్పటివరకు కేవలం గ్లామరస్‌ డాల్‌గానే గుర్తింపు పొందిన ఆమె ఆదిత్య 369 సినిమాలో కీలకపాత్ర పోషించి నటిగా గుర్తింపు పొందారు.

ఇటీవలె ఈ సినిమా విడుదలై 30 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ చిత్ర విశేషాలపై బాలకృష్ణ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సిల్క్‌ స్మిత గురించి మాట్లాడుతూ..'ఆమెకు తెలుగు రాకపోవడంతో ఇంగ్లీషులో డైలాగ్‌ పూర్తిచేసింది. షాట్‌ అయ్యాక ఓకేనా సార్‌ అని డైరెక్టర్‌ని అడిగే సరికి అందరూ బిత్తరపోయారు. నువ్ మాట్లాడింది ఇంగ్లీష్ తల్లీ.. అని ఆ డైరెక్టర్ చెప్పడంతో సెట్‌లో అంత నవ్వుకున్నాం.

ఇక మేకప్, కాస్ట్యూమ్స్ విషయంలో సిల్క్ స్మితను కొట్టిన ఆడదే లేదు. ఎందుకంటే శ్రీదేవి వంటి స్టార్‌ హీరోయిన్లు సైతం సిల్మ్‌ స్మిత కాస్ట్యూమ్స్, మేకప్‌ని ఇమిటేట్ చేసేది. ఒక డ్యాన్సర్‌ని స్టార్‌ హీరోయిన్లు సైతం ఫాలో కావడం అంటే అది మామూలు విషయం కాదు' అంటూ బాలకృష్ణ సిల్క్‌ స్మితపై ప్రశంసలు కురిపించారు. 
 

మరిన్ని వార్తలు