Balagam: బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘బలగం’.. 9వ రోజు రికార్డు కలెక్షన్స్‌!

12 Mar, 2023 21:52 IST|Sakshi

కంటెంట్‌ బాగుంటే.. చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది ప్రేక్షకులు పట్టించుకోరని ‘బలగం’తో మరోసారి రుజువైంది. ఎలాంటి అంచనాలు లేకుండా మార్చి 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన  ఈ చిత్రం..  ఊహించని విజయాన్ని సాధించింది. తొలి రోజే పాజిటివ్‌ టాక్‌ సంపాదించుకొని.. కలెక్షన్స్‌ పరంగా దూసుకెళ్తోంది.  ఈ వారం పెద్ద సినిమాలేవి లేకపోవడంతో థియేటర్స్‌ సంఖ్యని కూడా పెంచుకున్న ఈ సినిమా.. 9వ రోజు ఎవరూ ఊహించనవి విధంగా ఏకంగా రూ.1.77 కోట్లు గ్రాస్‌ కలెక్షన్స్‌ని రాబట్టింది.  9 రోజుల్లో ఈ చిత్రం మొత్తంగా రూ.9.15 కోట్లను వసూళ్లు చేసి నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. 

ఇప్పటి వరకూ ఈ సినిమా నైజాం ఏరియాలో రూ. 5.52 కోట్లు, సీడెడ్, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాల్లో కలిపి రూ. 3.63 కోట్లు వసూలు చేసింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలుపుకుని రూ. 9.15 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 4.02 కోట్లు షేర్‌ను వసూలు చేసి సత్తా చాటుకుంది. జబర్దస్త్‌ వేణు ఈ మూవీతో దర్శకుడిగా పరిచయమవగా దిల్‌ రాజు నిర్మించాడు. ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చాడు.

మరిన్ని వార్తలు