మెగాస్టార్‌ రికార్డును బద్దలు కొట్టిన బాలయ్య

20 Apr, 2021 11:51 IST|Sakshi

"కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది.. కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది.." ఇదిప్పుడు నందమూరి బాలకృష్ణ అభిమానుల ఫేవరెట్‌ డైలాగ్‌. కేవలం డైలాగ్‌ మాత్రమే కాదు, స్వామీజిగా దర్శనమిచ్చిన బాలయ్య లుక్స్‌కు సోషల్‌ మీడియా మొత్తం షేక్‌ అవుతోంది. యూట్యూబ్‌లో రికార్డులను సైతం తిరగరాస్తోంది. అఖండ టీజర్‌ విడుదలైన 25 గంటల్లో 12 మిలియన్ల వ్యూస్‌ రాగా ఆరు రోజులకే 27 మిలియన్ల వ్యూస్‌ దాటేసింది.

రెండు నెలల క్రితం రిలీజైన మెగాస్టార్‌ చిరంజీవి 'ఆచార్య' సినిమా టీజర్‌కు మాత్రం ఇప్పటివరకు 19 మిలియన్ల వ్యూసే వచ్చాయి. 'ఆర్‌ఆర్‌ఆర్‌' మోషన్‌ పోస్టర్‌ నెల రోజుల్లో 7 మిలియన్ల వ్యూస్‌ మాత్రమే రాబట్టింది. దీంతో బాలయ్య సినిమా రిలీజ్‌కు ముందే తన హవా చూపిస్తున్నాడని ఫుల్‌ ఖుషీ అవుతున్నారు అభిమానులు. మొత్తానికి హీరోల రికార్డులను ఒక్క టీజర్‌తో బద్దలు కొట్టేశాడు బాలయ్య. 

కాగా బోయపాటి - బాలయ్య కాంబినేషన్‌లో 'సింహా', 'లెజెండ్‌' వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు వచ్చాయి. ముచ్చటగా మూడోసారి వీరి కలయికలో వస్తున్న 'అఖండ' సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, పూర్ణ కీలక పాత్రలో నటిస్తోంది. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

చదవండి: Akhanda: అదిరిపోయే టైటిల్‌తో వచ్చిన బాలయ్య

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు