బాలయ్య ‘అఖండ’ ట్రైలర్‌: నెట్టింట మొదలైన మీమ్స్‌ రచ్చ..అన్నీ అరాచకాలే!

15 Nov, 2021 20:59 IST|Sakshi

టాలీవుడ్‌లో నటసింహం నందమూరి బాలక్రిష్ణ, మాస్‌ డైరక్టర్‌ బోయ‌పాటి శ్రీను కాంబోలో వచ్చే సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మామూలుగా మాస్‌ కాంబో వినే ఉంటాం అయితే వీరిద్దరిది ఊర మాస్ కాంబో. ప్రస్తుత రోజుల్లో బాల‌య్యతో పక్క యాక్షన్ చిత్రం తీయాలంటే అది తనతోనే సాధ్యమని నిరూపించుకున్నారు బోయపాటి. పైగా ఇప్ప‌టి వ‌ర‌కు ఈ కాంబోలో వ‌చ్చిన సినిమాల‌న్నీ మాస్‌ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడమే కాక సూప‌ర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

తాజాగా వీరి కలయికలో తెరకెక్కిన ‘అఖండ’ సినిమాలో త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈనేప‌థ్యంలో ఈ సినిమా ట్రైల‌ర్‌ను ఆదివారం చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. సినిమాపై అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ట్రైల‌ర్ ఉండడంతో బాలయ్య ఫ్యాన్స్‌కు దీపావళి మళ్లీ వచ్చినట్లు ఉంది. ఇప్పటికే ఈ ట్రైలర్‌ విడుద‌లైన 24 గంట‌ల్లోపై కోటి వ్యూస్‌ను తెచ్చుకొని యూట్యూబ్‌లో నెంబ‌ర్ వ‌న్ ట్రెండింగ్‌లో ఉంది.

మరో వైపు ఈ సినిమా ట్రైల‌ర్‌పై సోష‌ల్ మీడియాలో బాల‌య్య అభిమానులు, నెటిజ‌న్లు సినిమాలోని సన్నివేశాలపై మీమ్స్ క్రియేట్ చేసి తెగ షేర్ చేస్తున్నారు. దీంతో సోష‌ల్ మీడియాలో ‘అఖండ’ ట్రైల‌ర్ మీమ్స్‌ హల్‌చల్‌ చేస్తున్నాయి. అందులో.. ట్రైల‌ర్‌లోని మాస్ డైలాగ్స్‌, యాక్షన్‌ సీన్స్‌ ఇలా ఏ ఒకదాన్ని వదలకుండా మీమ్స్ నెట్టింట రచ్చ చేస్తున్నాయి. కొందరు నెటిజన్లు ఈ ట్రైలర్‌పై ఫన్నీగా మీమ్స్‌ పెడుతూ ట్రోల్‌ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు