కమర్షియల్‌ యాడ్‌ కోసం బాలయ్యకు భారీ రెమ్యునరేషన్‌.. ఎంతంటే..

29 Oct, 2022 13:42 IST|Sakshi

సినీ సెలబ్రెటీలు ఒక పక్క సినిమాలు చేస్తునే మరో పక్క ప్రకటనల్లో నటిస్తుంటారు. పలు కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ భారీ మొత్తంలో డబ్బులు సంపాదిస్తుంటారు. అయితే కొంతమంది నటులు మాత్రం కమర్షియల్‌ యాడ్స్‌కి దూరంగా ఉంటారు. అలాంటి వాళ్లలో నందమూరి బాలకృష్ణ కూడా ఇన్నాళ్లు ఉండేవాడు. కానీ తాజాగా ఆయన కూడా బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారాడు.

ఎలాంటి వ్యాపార సంస్థల ఉత్పత్తుల ప్రకటనల్లో నటించకూడదు, బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించకూదని నియమం పెట్టుకున్న బాలయ్య, దాన్ని బ్రేక్ చేస్తూ ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారాడు. ఆ యాడ్‌లో కూడా బాలయ్య తనదైన స్టైల్లో డైలాగ్స్‌ చెబుతూ అదరగొట్టేశాడు. బాలయ్య కెరీర్‌లో ఇది తొలి కమర్షియల్‌ యాడ్‌ కావడంతో.. సదరు రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ భారీ మొత్తంలో పారితోషికం చెల్లించిందట.

ఈ యాడ్ కోసం బాలయ్య ఏకంగా రూ.15 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకున్నట్లు టాలీవుడ్‌ వర్గాల అంచనా. ఆ లెక్కన చూస్తే బాలకృష్ణ ఒక సినిమాకు తీసుకునే రెమ్యూనరేషన్ బ్రాండ్ అంబాసిడర్ గా అందుకున్నారు. మార్కెట్‌లో బాలకృష్ణకు ఉన్న క్రేజీ దృష్ట్యా అంత భారీ మొత్తంలో చెల్లించారట. ఏదేమైనా సినిమాల్లోనే కాకుండా.. ప్రకటనల్లో కూడా నందమూరి నటసింహం అందరగొట్టేసిందని బాలయ్య ఫ్యాన్స్‌ సంబరపడుతున్నారు. 

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం బాలయ్య ‘వీరసింహా రెడ్డి’అనే సినిమాలో నటిస్తున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. దీని తర్వాత అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. 

మరిన్ని వార్తలు