NBK108: అనిల్‌ రావిపూడి-బాలకృష్ణ మూవీ ప్రకటన వచ్చేసింది

11 Jun, 2022 05:30 IST|Sakshi
బాలకృష్ణ, అనిల్‌ రావిపూడి

బాలకృష్ణ మంచి జోరు మీదున్నారు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్న ఆయన తాజాగా 108వ చిత్రానికి పచ్చజెండా ఊపేశారు. ఈ సినిమాకి అనిల్‌ రావిపూడి దర్శకుడు. శుక్రవారం బాలకృష్ణ బర్త్‌ డే సందర్భంగా 108వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.

‘‘గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ బాలకృష్ణ, డబుల్‌ హ్యాట్రిక్‌ బ్లాక్‌ బస్టర్‌ దర్శకుడు అనిల్‌ రావిపూడిల క్రేజీ కాంబినేషన్‌లో ఎన్‌బీకే 108 సినిమా రూపొందనుంది.  వినూత్న కథనంతో భారీ ఎత్తున ఈ చిత్రం తెరకెక్కనుంది. మాస్‌ పల్స్‌ తెలిసిన అనిల్‌ రావిపూడి.. మునుపెన్నడూ చూడని పాత్రలో బాలకృష్ణను చూపించేందుకు పర్ఫెక్ట్‌ స్క్రిప్ట్‌ రెడీ చేశారు’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.   

మరిన్ని వార్తలు