‘బలరామయ్య బరిలో దిగితే’ ఎలా ఉంటుంది?

7 Dec, 2020 11:26 IST|Sakshi

నందమూరి బాలకృష్ణ అనగానే గుర్తొచ్చేది యాక్షన్‌ సినిమాలు, పవర్‌ఫుల్‌ డైలాగులు.. ఆరు పదుల వయసులోనూ వరుసపెట్టి సినిమాలు చేస్తూ ఆడియన్స్‌ను అలరిస్తున్నారు. మాస్‌ సినిమాలకు బాలయ్య పెట్టింది పేరు. ఏజ్‌ పెరుగుతున్నకొద్దీ బాలకృష్ణలో ఎనర్జీ కట్టలుగా తెంచుకొస్తుంది. ఓ వైపు రాజకీయాలతో బిజీగా గడుపుతున్నా.. మంచి కథలతో తన వద్దకు వచ్చే దర్శకులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో రెండు సినిమాలు చేసేందుకు బాలకృష్ణ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. చదవండి: బాలకృష్ణ తీరుపై క్లారిటీ ఇచ్చిన హీరో

'కందిరీగ', 'రభస' వంటి చిత్రాలను చేసి, ప్రస్తుతం 'అల్లుడు అదుర్స్' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న డైరెక్టర్‌ సంతోష్ శ్రీనివాస్.. బాలకృష్ణతో కలిసి ఓ సినిమా ప్లాన్‌ చేయనున్నారని సమాచారం. ఇప్పటికే హీరోకు కథ వినిపించడం, ఇందుకు బాలకృష్ణ కూడా ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే  విభిన్న కథతో పాటు టైటిక్‌ కూడా పవర్‌ఫుల్‌గా ఉండాలని భావించిన దర్శకుడు ఈ సినిమాకు ‘బలరామయ్య బరిలో దిగితే’ అనే పేరును కూడా ఖరారు చేస్తున్నట్లు టాక్‌. వీరి కాంబినేషన్‌లో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్ టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. చదవండి: కొడుకుతో మహేష్‌.. మనవడితో బాలయ్య..

మరిన్ని వార్తలు