అలా ఎవరికీ జరగకూడదు.. తారకరత్న పేరు చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం!

20 Mar, 2023 19:49 IST|Sakshi

నందమూరి తారకరత్న అకాల మరణం ఆయన కుటుంబాంతో పాటు అభిమానులకు తీరని లోటు. ఆ లోటును భర్తీ చేయడం ఎవరి వల్ల సాధ్య పడదు. తారకరత్న మరణంతో ఆయన భార్య అలేఖ్యా రెడ్డి ఇప్పటికే పలుసార్లు భావోద్వేగానికి గురైంది. తారకరత్నను తలుచుకుని ఎమోషనలైంది. అందరికీ అందని లోకాలకు చేరిన తారకరత్న కుటుంబానికి అండగా నిలిచి గొప్ప మనసును చాటుకున్నారు నందమూరి బాలకృష్ణ. 

ఇటీవలే తారకరత్న మరణించిన నెల రోజులు పూర్తి కావడంతో అలేఖ్యా రెడ్డి ఎమోషనల్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ బాలయ్య చేసిన సాయాన్ని  గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురైంది. మేం కుటుంబం అని పిలిచే ఏకైక వ్యక్తి ఆయనే.. కష్టసుఖాల్లో కొండంత అండగా నిలబడిన అన్నిీ తానై నడిపించారని గుర్తు చేసుకున్నారు అలేఖ్యా రెడ్డి. 

ఆస్పత్రికి తారకరత్న పేరు

ప్రస్తుతం బాలయ్య తీసుకున్న నిర్ణయం తారకరత్న అభిమానులకు గుర్తుండిపోయేలా ఉండనుంది. తారకరత్న మనమధ్య లేకపోయినా.. ఆయన పేరు మాత్రం చరిత్రలో నిలిచిపోయేలా బాలయ్య నిర్ణయం తీసుకుని మరోసారి తన ప్రేమను చాటుకున్నారు. తన కుటుంబానికి వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదని బాలయ్య అన్నారు. 

(ఇది చదవండి: తారకరత్న కోసం బాలయ్య ఎంతో చేశారు.. ఎమోషనల్‌ అయిన అలేఖ్య రెడ్డి)

తన ప్రాణంగా భావించే తారకరత్న పేరు మీద గుండె జబ్బులు ఉన్న పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని బాలయ్య నిర్ణయించారు. అంతేకాకుండా హిందూపురంలో బాలయ్య నిర్మించిన హాస్పిటల్‌ బ్లాక్‌కు తారకరత్న పేరు పెట్టారు. వాటితో పాటు పేదప్రజల వైద్యం కోసం రూ.1.30 కోట్లు పెట్టి ఆపరేషన్ కోసం పరికరాలను ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. ఆస్పత్రికి వచ్చే చిన్నపిల్లలకు ఉచితంగా భోజనం, మందులు కూడా మూడు నెలల పాటు అందించనున్నారు. తారకరత్న పేరు చరిత్రలో నిలిచిపోయేలా బాలకృష్ణ తీసుకున్న నిర్ణయంపై ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు