మెడికల్‌ మాఫియా నేపథ్యంలో... 'బలమెవ్వడు' మూవీ

26 Sep, 2022 11:09 IST|Sakshi

ధృవన్‌ కటకం, నియా త్రిపాఠీ జంటగా సత్య రాచకొండ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బలమెవ్వడు’. సుహాసిని, నాజర్, పృథ్వీరాజ్‌ కీలకపాత్రలు పోషించారు. సనాతన దృశ్యాలు సమర్పణలో ఆర్‌బీ మార్కండేయులు నిర్మించిన ఈ సినిమా అక్టోబర్‌ 1న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ విడుదలలో పృథ్వీరాజ్‌ మాట్లాడుతూ–‘‘మెడికల్‌ మాఫియా ఒక కామన్‌ మ్యాన్‌ను ఎంతలా దోచుకుంటుంది? దాన్ని ఎలా ఎదుర్కోవాలి? అనే సందేశాత్మక కథతో ఈ సినిమా తీశాం’’ అన్నారు. 

‘‘కోవిడ్‌ వల్ల మాకు సపోర్ట్‌గా నిలిచిన నిర్మాతలు వెనక్కి వెళ్లడంతో చాలా ఇబ్బంది పడ్డాం. నా తల్లితండ్రులు ఇంటిని తాకట్టు పెట్టి నాకు సపోర్ట్‌గా నిలిచి ఈ సినిమాను పూర్తి చేసినందుకు థ్యాంక్స్‌’’ అన్నారు సత్య రాచకొండ. ఈ చిత్రానికి కెమెరా: సంతోష్, గిరి, సంగీతం: మణిశర్మ. ద ∙ ధృవన్, పృథ్వీ, నియా, సత్య

మరిన్ని వార్తలు