ఆ సన్నివేశాలు కంటతడి పెట్టిస్తున్నాయి : బాలయ్య

13 Jan, 2023 12:46 IST|Sakshi

‘‘సంక్రాంతికి విందు భోజనంలాంటి సినిమా ‘వీరసింహారెడ్డి’. ప్రేక్షకులు, ఫ్యాన్స్‌.. ఇలా అందరి నుండి అద్భుతమైన ఆదరణ వస్తోంది’’ అన్నారు బాలకృష్ణ. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శ్రుతీహాసన్‌ జంటగా నటించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమా గురువారం విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన వీర మాస్‌ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ మీట్‌లో బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘అఖండ’లాంటి హిట్‌ తర్వాత అలాంటి మరో సినిమాని ప్రేక్షకులు ఆశిస్తారు.

అందుకు తగ్గట్టే నా అభిమాని అయిన గోపీచంద్‌ ‘వీరసింహారెడ్డి’ని అద్భుతంగా తీశాడు. ఈ చిత్రంలో నాకు–వరలక్ష్మికి మధ్య వచ్చే అన్నా చెల్లెలి సన్నివేశాలు మహిళలనే కాదు మగవాళ్లనూ కంటతడి పెట్టిస్తున్నాయి’’ అన్నారు. ‘‘నా కెరీర్‌లో ఇది బ్లాక్‌ బస్టర్‌’’ అన్నారు గోపీచంద్‌. ‘‘మా సినిమా తొలి రోజే 50 కోట్ల గ్రాస్‌ దాటుతోంది. ఇది పెద్ద రికార్డ్‌. బాలకృష్ణగారి మైలురాయి చిత్రానికి మేం నిర్మాతలు కావడం హ్యాపీ’’ అన్నారు నిర్మాతలు.

మరిన్ని వార్తలు