Surekha Sikri Death: 'చిన్నారి పెళ్లికూతురు' బామ్మ కన్నుమూత

16 Jul, 2021 10:57 IST|Sakshi

లెజెండరీ నటి సురేఖ సిఖ్రి కన్నుమూత

మూడుసార్లు నేషనల్‌ అవార్డు గెలుచుకున్న సురేఖ సిఖ్రి 

ముంబై : బాలికా వధు (చిన్నారి పెళ్లికూతరు) ఫేమ్‌ లెజెండరీ నటి సురేఖ సిఖ్రి (75) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా సిఖ్రి మరణించిందని ఆమె మేనేజర్‌ మీడియాకు వివరించారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సిఖ్రి.. శుక్రవారం తుదిశ్వాస విడిచింది. 'కిస్సా కుర్సి కా' చిత్రంతో తెరంగేట్రం చేసిన సురేఖ సిఖ్రి తమాస్ (1988), మమ్మో (1995) బధాయ్ హో (2018) చిత్రాలకు గానూ ఉత్తమ నటిగా మూడు నేషనల్‌ అవార్డులు సంపాదించుకుంది.


బాలికా వధు (చిన్నారి పెళ్లికూతరు)సీరియల్‌ ద్వారా ఎంతో పాపులర్‌ అయిన సిఖ్రి తెలుగు వారికి కూడా బాగా దగ్గరైంది. బామ్మగా సిఖ్రి నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 2018లో షూటింగ్‌ సమయంలో బాత్రూంలో జారిపడటంతో సురేఖ సిఖ్రికు బ్రెయిన్‌ స్ర్టోక్‌ వచ్చింది. కోలుకుంటున్న సమయంలోనే రెండేళ్ల తర్వాత మరోసారి బ్రెయిన్‌ స్ర్టోక్‌ రావడంతో ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. అప్పటినుంచి నటనకు కాస్త బ్రేక్‌ ఇచ్చిన సురేఖ సిఖ్రి చివరిసారిగా ఆంథాలజీ ఘోస్ట్ స్టోరీస్‌ అనే చిత్రంలో నటించింది. 

మరిన్ని వార్తలు