Bandla Ganesh: హరీశ్‌ శంకర్‌ మళ్లీ నాతో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నారు

14 May, 2022 10:47 IST|Sakshi

Bandla Ganesh About Clash With Director: నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌కు ఖరీదైన వాచ్‌ బాహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇది ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. కాగా గతంలో బండ్ల గణేశ్‌, హరీశ్‌ శంకర్‌ మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ సమయంలో సోషల్‌ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా బండ్ల గణేశ్‌, హరీశ్‌ శంకర్‌ను కలవడం, బాహుమతులు ఇచ్చుకోవడం హాట్‌టాపిక్‌గా నిలిచింది. దీంతో గతంలో బండ్ల చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా మరోసారి తెరపైకి వచ్చాయి. 

చదవండి: ఆస్తులన్ని పోయాయి, ఒక్క పూట భోజనమే చేసేదాన్ని: ‘షావుకారు’ జానకి

హరీశ్‌ శంకర్‌తో గొడవపై ఓ ఇంటర్య్వూలో స్పందించిన బండ్ల గణేశ్‌ ఇలా వ్యాఖ్యానించాడు. ‘ప్రతి రిలేషన్‌లో గొడవలు, మనస్పర్థాలు సాధారణమే. ఇలాంటివి తరచూ జరుగుతూనే ఉంటాయి. మళ్లీ సర్థుకుంటాయి. ఇలాంటి వాటి గురించి మాట్లాడి టైం వేస్ట్‌ చేసుకోవద్దు’ అన్నాడు. అనంతరం ‘గబ్బర్‌ సింగ్‌ మూవీ నా జీవితాన్నే మార్చేసింది. ఈ మూవీతో నాకు అంత పెద్ద హిట్‌ ఇచ్చిన హరీశ్‌ శంకర్‌కు నేను ఎప్పటికీ కృతజ్ఞతుడినే. నా జీవింతాంతం ఆయన నాకు మంచి స్నేహితుడు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక హరీశ్‌ శంకర్‌ కూడా మనసులో ఏం పెట్టుకోలేదని, ఆయన అంత వదిలేసి తనతో చాలా ఫ్రెండ్లిగా ఉంటున్నారని చెప్పాడు. అంతేగాక పవన్‌ కల్యాణ్‌ చాన్స్‌ ఇస్తే తనతో సినిమా చేసేందుకు ఆయన రెడీగా ఉన్నారని చెప్పాడు.

చదవండి: ముచ్చటగా మూడోసారి.. అదే రిపీట్‌ అవుతుందా?

కాగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన గబ్బర్‌ సింగ్‌ సినిమాకు బండ్ల గణేశ్‌ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ అప్పట్లో బ్లాకబస్టర్‌గా నిలిచింది. దీంతో మే 12తో ఈ సినిమా పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా బండ్ల డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ కాస్ట్‌లీ వాచ్‌ను కానుకగా ఇచ్చాడు.  ఇదిలా ఉంటే ఇదే మూవీ 8వ వార్షికోత్సవం సమయంలోనే హరీశ్‌ శంకర్‌, బండ్ల గణేశ్‌ మధ్య వాగ్వాదం నెలకొంది.  'గబ్బర్ సింగ్' 8వ వార్షికోత్సవం సందర్భంగా హరీశ్ శంకర్ అందరికీ థ్యాంక్స్ చెపుతూ ఒక లేఖను విడుదల చేశారు. అయితే, ఆ సినిమా నిర్మాత అయిన బండ్ల గణేశ్ పేరును మాత్రం ప్రస్తావించలేదు. దీంతో, రచ్చ మొదలైంది. హరీశ్‌ శంకర్‌ ఓ రీమేక్ డైరెక్టర్ అని, అతనితో మళ్లీ సినిమా చేసే ప్రసక్తే లేదంటూ బండ్ల అప్పట్లో ఫైర్‌ అయిన విషయం విధితమే.

మరిన్ని వార్తలు