హీరోగా మారిన బండ్ల గణేశ్‌, అవార్డు విన్నింగ్‌ మూవీ రీమేక్‌తో..

21 Aug, 2021 08:08 IST|Sakshi

Bandla Ganesh: క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా వెండితెరపై నవ్వులు పూయించిన బండ్ల గణేశ్‌ తర్వాత పలు సినిమాలు నిర్మించి నిర్మాతగా సెటిలైపోయాడు. అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో హాల్‌చల్‌ చేస్తూ ప్రేక్షకులకు దర్శనమిస్తున్న ఆయన ఇటీవల మళ్లీ నటుడుగా తన కెరీర్‌ ప్రారంభించాడు. ఈ క్రమంలో తాజాగా బండ్ల హీరోగా మారబోతున్నాడు.

తమిళంలో ఆర్‌.పార్తిబన్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించి, నటించిన ‘ఒత్త సెరప్పు సైజ్‌ 7’ మూవీ రీమేక్‌లో బండ్ల గణేశ్‌ హీరోగా నటిస్తున్నాడు. వెంకట్‌ చంద్ర దర్శకత్వంలో స్వాతీ చంద్ర నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్‌ సెప్టెంబర్‌ మొదటి వారంలో ప్రారంభం కానుంది. హీరో పాత్ర కోసం బండ్ల గణేష్‌ ప్రత్యకంగా మేకోవర్‌ అవుతున్నాడు. తమిళ హిట్‌, జాతీయ అవార్డులు సాధించిన ‘ఒత్త సెరుప్పు సైజ్‌ 7’కు ఇది తెలుగు రీమేక్‌. 

చదవండి: నాకు చేతబడి చేశారు, 13 ఏళ్లు నరకం చూశా: నటుడు

మరిన్ని వార్తలు