ఒట్టు పొరపాటున జరిగింది: బండ్ల గణేష్‌

25 Jul, 2020 13:01 IST|Sakshi

వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన రామ్ గోపాల్ వర్మ రూపొందించిన తాజా చిత్రం పవర్‌స్టార్. శనివారం ఉదయం 11 గంటలకు వర్మ ఈ చిత్రాన్ని ఆర్జీవి వ‌ర‌ల్డ్ థియేట‌ర్‌లో విడుద‌ల చేశారు. ఈ సినిమాలో పవన్‌ కల్యాణ్‌తో పాటు చాలా మంది నటీ,నటులను పోలిన వ్యక్తులతో ఈ సినిమా తెరకెక్కించారు. ఇంతవరకు బాగానే ఉన్నా వర్మ తాజాగా విడుదల చేసిన `బ్రదర్స్ వీడియో`కు బండ్ల గణేష్ ట్విట్టర్‌లో రియాక్ట్ అవుతూ లైక్ కొట్టారు. ఇది  పవర్‌ స్టార్‌ అభిమానుల్ని షాక్‌కి గురిచేసింది. (వర్మ ఆఫీస్‌పై జనసేన కార్యకర్తల దాడి)

కాగా ఆ వీడియోలో ప‌వ‌న్‌, చిరంజీవి పోలిక‌ల‌తో ఉన్న ఇద్దరు వ్య‌క్తులు మాట్లాడుకుంటున్నారు. వర్మ పోస్ట్‌ చేసిన ఈ వీడియోకి బండ్ల గణేష్‌ లైక్‌ చేయడం, ఆ వెంటనే ఓ అభిమాని 'గదంతా కాదు బండ్లన్నా.. ఈ వీడియోను ఎందుకు లైక్ చేసినవ్` అని అడిగగా.. వెంటనే స్పందించిన బండ్ల `ఒట్టు ఏదో పొరపాటున జరిగింది. నేనెప్పుడూ ఇలా చేయను. జరిగిన దానికి క్షమించండి` అంటూ బదులిచ్చాడు. (రెండు రోజుల తర్వాత కరోనా అంటూ ఫోన్‌..!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు