సూపర్‌ బండ్ల గణేశ్‌ అన్నా...వీడియో వైరల్‌

8 May, 2021 14:56 IST|Sakshi

బండ్ల గణేశ్‌.. టాలీవుడ్‌ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అటు కమెడియన్‌గా, ఇటు నిర్మాతగా టాలీవుడ్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సినిమాలతో ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో అంతకంటే ఎక్కువ గుర్తింపు తన మాటలు, చేష్టలతో తెచ్చుకున్నాడు. సోషల్ మీడియాలో బం‍డ్ల ఒక సెన్సేషన్‌. చాలా సార్లు ఆయన చేసిన ట్వీట్లు వైరల్‌ అయ్యాయి.

తాజాగా ఆయన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఓ వీడియో వైరల్‌గా మారింది. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. సెలూన్‌కి వెళ్లి కటింగ్‌ చేయించుకుంటే ఎక్కడ కరోనా మహమ్మారి సోకుతుందో అనే భయంతో చాలా మంది అలాగే గడ్డాలు, మీసాలు పెంచేస్తున్నారు. కొందరు మాత్రం ఇంట్లోనే కత్తెర పట్టి కటింగ్‌ చేసుకుంటున్నారు.

తాజాగా ఇదే పని బండ్ల గణేశ్‌ చేశాడు. తన తండ్రికి తానే స్వయంగా కటింగ్‌ చేశాడు. ఈ వీడియోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. ‘కరోనా భయంతో మా నాన్నకి ఈరోజు మా  షాద్ నగర్ ఇంట్లో నేనే కటింగ్ చేశాను’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగవైరల్‌ అవుతంది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలీలో స్పందిస్తున్నారు. ‘సూపర్‌ అన్నా’, ‘గుడ్‌ జాబ్‌..మంచి కొడుకువని నిరూపించుకున్నావు’, మల్టీ టాలెంటెడ్‌ పర్సన్‌ని నువ్వు’ అంటూ బండ్ల గణేశ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 


చదవండి:
వైర‌ల్‌: టీకా తీసుకుంటూ ఏడ్చేసిన న‌టి 
ప్రియురాలిని వదిలి వెళ్లలేక, షోను వదులుకోలేక..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు