దయచేసి నా కడుపు మీద కొట్టకండి : బండ్ల గణేష్‌

11 Oct, 2020 19:58 IST|Sakshi

బండ్ల గణేష్‌ ఎమోషనల్‌ ట్వీట్

బండ్ల గణేష్‌.. ఎప్పుడు ఎలా ఉంటాడో.. ఎలా మాట్లాడతాడో అంచనా వేయడం కూడా కష్టమే. ఆయన మాటలతో పాటు ఎదుగుదల కూడా అందరికి ఆశ్చర్య కలిగించింది. కమెడియన్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్.. ఉన్నట్లుండి నిర్మాత అయ్యాడు. అంతేకాదు ప్రొడ్యూసర్‌గా స్టార్‌ హీరోలతో సినిమాలు తీశాడు. ఇక రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బండ్ల గణేష్ 2018 తెలంగాణా శాసనసభ ఎన్నికల్లో పోటీచేయాలని కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కానీ అతనికి టికెట్ దక్కలేదు. ఆ తర్వాత 2019లో తానూ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు నిర్ణయం తీసుకున్నాడు.

ఇక ఇటీవల కరోనా నుంచి కోలుకున్నాక తన ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి. ఇకపై ఎవరిని తక్కువ చేసి మాట్లాడనని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు. ఇప్పటి వరకు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించమని కూడా ఆయన సోషల్‌ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. కరోనా నుంచి కోలుకున్నాక బండ్ల దాదాపు పాజిటివ్‌ విషయాలనే ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తున్నారు. ఇటీవల ఆయన 'నా బాస్ ఓకే చెప్పారు. నా కలలు మరోసారి నిజమయ్యాయి. నా దేవుడు పవన్ కల్యాణ్‌కి ధన్యవాదాలు' అంటూ గణేష్ ఇటీవల ట్వీట్ చేయడంతో మరోసారి గణేష్, పవన్ కళ్యాణ్ కాంబోలో సినిమా రాబోతుందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. మెగాభిమానులు కూడా బండ్లకు శుభాకాంక్షలు తెలుపుతూ.. మంచి డైరెక్టర్‌ని సెట్‌ చేయమంటూ సలహాలు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా బండ్ల చేసిన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. 

సోషల్ మీడియాలో తనపైన వస్తున్న వార్తల పైన బండ్ల గణేష్ స్పందిస్తూ‘ వీపుమీద కొట్టండి .కానీ నీ దయ చేసి కడుపు మీద కొట్టకండి .ఇది నా విన్నపం.నా మీద దయచేసి ఏ విధమైన వార్తలు రాయొద్దు నేను చెప్పే వరకు ఇది నా అభ్యర్థన’ అని ట్వీట్‌ చేశారు. మరి ఈ ట్వీట్‌ వెనుక ఉన్న విషయం ఏమిటనేది మాత్రం బండ్ల గణేష్‌ తెలియజేయలేదు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా