MAA Elections 2021: నామినేషన్‌ ఉపసంహరించుకున్న బండ్ల గణేశ్‌

1 Oct, 2021 15:31 IST|Sakshi

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు రోజురోజుకు ఆసక్తిగా మారుతున్నాయి. అభ్యర్థులంతా ప్రచారంలో బిజీగా ఉంటున్న నేపథ్యంలో బండ్ల గణేశ్‌ ఊహించిన షాక్‌ ఇచ్చాడు. తాజాగా తాను వేసిన నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు. ప్రకాశ్‌ రాజ్‌, శ్రీకాంత్‌లతో  దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ ‘నా దైవ సమానులు.. నా ఆత్మీయులు.. నా శ్రేయోభిలాషుల సూచన మేరకు నేను 'మా' జనరల్ సెక్రెటరీ నామినేషన్ ఉపసంహరించుకున్నాను’ అంటూ ట్వీట్‌ చేసి అందరికి షాక్‌ ఇచ్చాడు. 

‘మా’ జనరల్‌ సెక్రటరీ పదవికి ఇండిపెండెంట్‌గా పోటీకి దిగుతూ బండ్ల గణేశ్‌ నామినేషన్‌ దాఖలు చేయగా, దాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించడం మరోసారి చర్చకు దారి తీసింది. 

చదవండి: ప్రకాశ్‌ రాజ్‌ ట్వీట్‌పై రీట్వీట్‌ చేసిన బండ్ల గణేష్‌, నెటిజన్లు ఫిదా

మరిన్ని వార్తలు