పప్పు సేన నన్ను మిస్ అవుతోంది : కంగన

17 Oct, 2020 15:41 IST|Sakshi

కంగనా సిస్టర్స్‌కు కోర్టు షాక్

కేసు నమోదు చేయాలని   బాంద్రాకోర్టు ఆదేశం

సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి  కంగనా రనౌత్కు వరుస  కేసుల షాక్ తగులుతోంది. ఇప్పటికే కర్నాటక కోర్టు ఆదేశాలకు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు కాగా తాజాగా బాంద్రా కోర్ట్ కంగనాకు మరో ఝలక్ ఇచ్చింది.  అంతేకాదు కంగనాతోపాటు ఆమె సోదరి రంగోలి చందేల్‌కి ఇబ్బందులు తప్పలేదు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే పై అవమానకరమైన వ్యాఖ్యలు,సోషల్ మీడియాలో మతవిద్వేషాన్ని రెచ్చగొడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో వారిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు నమోదైంది. దీన్ని విచారించిన బాంద్రా మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్టు కంగనా, ఆమె సోదరి రంగోలి చందేల్‌ పై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది.  

ఇద్దరు సోదరీమణులు బాలీవుడ్, ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే గురించి అవమానకరమైన వ్యాఖ్యలను ట్వీట్ చేస్తున్నారని ఆరోపించిన మున్నవారాలి అకాసాహిల్ అహస్రఫాలి సయ్యద్ ఈ ఫిర్యాదును నమోదు చేశారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, వారి ట్వీట్లు మత విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ఆరోపించారు. ఈమేరకు బాంద్రా పోలీస్‌స్టేషన్‌లో దీనిపై ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించానని, కాని వారు దానిని నమోదు చేయలేదని ఆయన ఆరోపించారు. దీంతో బాంద్రా కోర్టును ఆశ్రయించానన్నారు. మరోవైపు దీనిపై స్పందించిన కంగనా మహారాష్ట్రలోని పప్పు సేనకు తనపై మక్కువ ఎక్కువై పోయిందంటూ వ్యంగ్యంగా కమెంట్ చేశారు. అంత మిస్ అవ్వద్దు.. త్వరలోనే అక్కడకు వస్తాను అంటూ ట్వీట్ చేశారు. తన నవరాత్రి ఉపవాస ఫోటోలను షేర్ చేశారు. కాగా వ్యవసాయ చట్టాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తుమకూరు కోర్టు ఆదేశాల మేరకు క్యతాసంద్ర పోలీస్ స్టేషన్‌లో కంగనాపై ఎఫ్‌ఐఆర్ దాఖలైన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు