గూఢచారితో జోడీ 

21 Nov, 2023 01:31 IST|Sakshi
బనితా సంధు

అడివి శేష్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘గూఢచారి 2’ (జీ 2). వినయ్‌ కుమార్‌ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరో యిన్‌గా బనితా సంధుని ఫిక్స్‌ చేసినట్లు యూనిట్‌ పేర్కొంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘‘అక్టోబర్, సర్దార్‌ ఉదమ్‌’ వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న బనితా. ‘జీ 2’లో సరికొత్త పాత్రలో కనిపిస్తారు’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ‘‘నా తొలి పాన్‌ ఇండియా చిత్రమిది’’ అన్నారు బనితా సంధు.  

మరిన్ని వార్తలు