‘బ్యాట్‌ లవర్స్‌’..

12 Jul, 2021 01:39 IST|Sakshi

మణి సాయితేజ, హాసినీ రాయ్‌ జంటగా ఎ.రాబిన్‌ నాయుడు దర్శకత్వం వహించిన చిత్రం ‘బ్యాట్‌ లవర్స్‌’.  దీక్షిక సమర్పణలో కొండ్రాసి ఉపేందర్‌ నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను నిర్మాత సి.కల్యాణ్‌ విడుదల చేశారు.  ‘‘క్రికెట్‌ నేపథ్యంలో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు’’ అన్నారు ఉపేందర్‌. ‘‘గ్రామీణ నేపథ్యంలో కథ ఉంటుంది’’ అన్నారు ఎ.రాబిన్‌ నాయుడు. మణి సాయితేజ, హాసినీ రాయ్, మ్యూజిక్‌ డైరెక్టర్‌ డేవిడ్, సినిమాటోగ్రాఫర్‌ సంతోశ్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు