ఆకట్టుకుంటున్న ‘బతుకు బస్టాండ్‌’ వీడియో గ్లింప్స్‌

5 May, 2021 10:02 IST|Sakshi

విరాన్‌ ముత్తంశెట్టి హీరోగా, నికిత అరోరా, శ్రుతీ శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘బతుకు బస్టాండ్‌’. ఐఎన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. చక్రధర్‌ రెడ్డి సమర్పణలో ఐ. కవితా రెడ్డి, ఓ. మాధవి నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా థీమ్‌ని పరిచయం చేస్తూ విడుదల చేసిన గ్లింప్స్‌ వీడియో ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఆ మధ్య హీరో అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా ‘బతుకు బస్టాండ్‌’ టీమ్‌ విడుదల చేసిన ట్రిబ్యూట్‌ వీడియోకు మంచి స్పందన వచ్చింది. విరాన్, నికితా అరోరా ఫస్ట్‌ లుక్‌కి కూడా మంచి స్పందన వస్తోంది. తాజాగా థ్రిల్లింగ్‌ విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో విడుదల చేసిన వీడియో గ్లింప్స్‌కి కూడా సోషల్‌ మీడియాలో విశేష స్పందన వస్తోంది. జూన్‌ 11న మా సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వాస్‌ కమల్, సంగీతం: మహవీర్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు