Vijay Beast Movie: విజయ్‌ ‘బీస్ట్‌’కు తెలుగులో భారీ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌.. అన్ని కోట్లా?

12 Apr, 2022 16:45 IST|Sakshi

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ‘ఇళయదళపతి’ విజయ్‌కి టాలీవుడ్‌లోనూ మంచి మార్కెట్‌ ఉంది. ‘తుపాకి’ తర్వాత తన ప్రతి సినిమా తెలుగులో విడుదలవుతూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. ఈ నెపథ్యంలో ఆయన తాజా చిత్రం ‘బీస్ట్‌’ విడుదలకు ముందే తెలుగులో భారీ బిజినెస్‌ని జరుపుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి ఈ మూవీ దాదాపు 10 కోట్ల బిజినెస్‌ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

నైజాం ఏరియాలో రూ.3.5కోట్ల బిజినెస్‌ చేసిందట. ఆంధ్రప్రదేశ్‌లో రూ.4.40 కోట్లు, సీడెడ్‌లో రూ.2.1 కోట్లకు అమ్ముడు పోయిందని సమాచారం. దాదాపు 505 థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాకి బ్రేక్ ఈవెన్ 10.50 కోట్లుగా ఫిక్స్ చేశారు. విజయ్‌ గత చత్రం ‘మాస్టర్‌’కు తెలుగులో రూ.4 కోట్ల బిజినెస్‌ జరిగింది. ఇప్పుడు ఏకంగా రూ. 6 కోట్లు వరకు విజయ్‌ మార్కెట్‌ పెరగడం గమనార్హం.  ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ. 120 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు చెబుతున్నారు. 

ఇక బీస్ట్‌ మూవీ విషయానికొస్తే.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్‌ 13న తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల కానుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది, ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది.

మరిన్ని వార్తలు