బీట్స్‌ ఆఫ్‌ రాధేశ్యామ్‌

21 Oct, 2020 08:12 IST|Sakshi

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్‌’. ఈ ప్యాన్‌ ఇండియా సినిమాకి రాధా కృష్ణకుమార్‌ దర్శకుడు. కృష్ణంరాజు సమర్పణలో ఈ చిత్రాన్ని వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ నెల 23న ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా బీట్స్‌ ఆఫ్‌ రాధేశ్యామ్‌ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేస్తున్నామని ప్రకటించింది చిత్రబృందం. పలు హిట్‌ చిత్రాలకు స్వరాలందించిన జస్టిన్‌ ప్రభాకరన్‌ ఈ చిత్రానికి సంగీత దర్శకునిగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నామని నిర్మాతలు తెలిపారు. ప్రస్తుతం యూరప్‌లో షూటింగ్‌ జరుగుతోంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎన్‌. సందీప్, సినిమాటోగ్రఫీ: మనోజ్‌ పరమహంస.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు