ప్రభాస్‌ పుట్టినరోజు సర్‌ఫ్రైజ్‌ వచ్చేసింది..

17 Oct, 2020 14:32 IST|Sakshi

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘రాధే శ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకత్వంలో గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్‌ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా అతి తక్కువమంది బృందంతో చిత్రీకరణ జరుపుతున్నట్లు సమాచారం. యూరప్ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ లవ్ డ్రామాలో ప్రేరణ అనే పాత్రలో పూజా హెగ్డే కనిపించనుంది. ఇక ఇటీవల పూజా హెగ్డే పుట్టిన రోజు(అక్టోబర్‌ 13) సందర్భంగా రాధేశ్యామ్ నుంచి ఆమె లుక్ విడుదల చేసిన విషయం తెలిసిందే. వెస్ట్రన్‌ ట్రెడిషనల్‌ వేర్‌లో ఒక రెస్టారెంట్‌లో ప్రభాస్‌ ఎదురుగా కూర్చున్న పూజా నవ్వులు చిందిస్తూ అందంగా కనిపిస్తున్నారు.  పోస్టర్‌లో ఆకుపచ్చదనం హైలైట్‌గా నిలిచింది. చదవండి: మిస్ట‌రీ: అప్పుడు క‌ట్ట‌ప్ప‌, ఇప్పుడు సీత‌!

తాజాగా ప్రభాస్‌ 41వ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్‌ 23న బీట్స్‌ ఆఫ్‌ ‘రాధే శ్యామ్‌’ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని శనివారం ప్రభాస్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. ప్రభాస్‌ బర్త్‌డేకు తప్పకుండా ఏదో ఒక అప్‌డేట్‌ వస్తుందనన్నాశగా ఎదురుచూస్తున్న అభిమానులకు బీట్స్‌ ఆఫ్‌ రాధేశ్యామ్‌తో బిగ్‌ స‌ర్‌ప్రైజ్ ఇవ్వనున్నాడు. కాగా రాధే శ్యామ్‌ సినిమాతోపాటు ప్రభాస్‌ చేతినిండా సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌తో ఆదిపురుష్‌, నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ చిత్ర చేయనున్నాడు. చదవండి: ‘రాధే శ్యామ్‌’ లో ప్రేరణగా పూజా.. ఫస్ట్‌లుక్‌ అదుర్స్‌

Feel the #BeatsOfRadheShyam on 23rd October through a motion poster. Stay tuned! @director_radhaa @hegdepooja @uvcreationsofficial @tseriesfilms @gopikrishnamvs #KrishnamRaju #BhushanKumar #VamsiReddy @uppalapatipramod @praseedhauppalapati #AAFilms @radheshyamfilm #RadheShyam

A post shared by Prabhas (@actorprabhas) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు