మళ్లీ కాంబినేషన్‌ షురూ

28 Nov, 2020 05:25 IST|Sakshi
జయంతిలాల్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, వీవీ వినాయక్‌

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి ‘అల్లుడు శీను’ తొలి సినిమా. డైనమిక్‌ డైరెక్టర్‌ వీవీ వినాయక్‌ ఈ సినిమాతో శ్రీనివాస్‌ను హీరోగా తెలుగుకు పరిచయం చేశారు. మంచి సక్సెస్‌ను కూడా తనకు అందించారు. ఇప్పుడు మరోసారి తన తొలి దర్శకుడితో బాలీవుడ్‌కి పరిచయం కాబోతున్నారు సాయి శ్రీనివాస్‌. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌ నటించిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘ఛత్రపతి’ హిందీలో రీమేక్‌ కాబోతోంది. ఈ రీమేక్‌ను వీవీ వినాయక్‌ డైరెక్ట్‌ చేయనున్నారు. ప్రభాస్‌ చే సిన రోల్‌ను సాయి శ్రీనివాస్‌ చేస్తారు.

ఈ రీమేక్‌ సాయి శ్రీనివాస్‌కే కాదు వినాయక్‌కి కూడా హిందీలో తొలి సినిమా అవుతుంది. పెన్‌ స్టూడియోస్‌ పతాకంపై జయంతిలాల్‌ గడ ఈ సినిమాను నిర్మిస్తారు. సాయి శ్రీనివాస్‌ మాట్లాడుతూ – ‘‘నా బాలీవుడ్‌ ఎంట్రీకి ఇదే సరైన ప్రాజెక్ట్‌ అని నమ్ముతున్నాను. ఈ పాత్ర చేయడం గొప్ప బాధ్యతలా ఫీల్‌ అవుతున్నాను’’ అన్నారు. ‘‘ఛత్రపతి’ కథకు సాయి శ్రీనివాస్‌ కరెక్ట్‌. రీమేక్స్‌లో వినాయక్‌గారి నైపుణ్యం అందరికీ తెలిసిందే’’ అన్నారు జయంతిలాల్‌ గడ.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు