బెల్లంకొండ శ్రీనివాస్‌ ఛత్రపతి మూవీ మేకర్స్‌కు భారీ నష్టం

3 Jun, 2021 20:28 IST|Sakshi

టాలీవుడ్‌ యంగ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ హిందీ రీమేక్‌ చిత్రం ‘ఛత్రపతి’ మేకర్స్‌కు భారీ నష్టం వాటిల్లినట్లు సమాచారం. వివి వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ తెలుగు రీమేక్‌ చిత్రం ఏప్రిల్‌లో సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా షూటింగ్‌ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఛత్రపతి కోసం మేకర్స్‌ హైదరాబాద్‌లో 6 ఎకరాల స్థలంలో ఓ భారీ విలేజ్‌ సేట్‌ వేశారట. ఇప్పటికే కోవిడ్‌తో నష్టపోయిన నిర్మాతలకు ప్రస్తుతం కురుస్తున్న వరుస వర్షాల కారణంగా దాదాపు 3 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. అప్పడు షూటింగ్‌ కోసం వేసిన ఈ భారీ విలేజ్‌ సేట్‌ ఈ వర్షాలకు తీవ్రంగా దెబ్బతినట్లు సమాచారం. ఇంకా సినిమా షూటింగ్‌ మొదలు కాకముందే మేకర్స్‌కు 3 కోట్ల నష్టం రావడం నిజంగా బాధించే విషయమే.

ఇక ఈ సెట్‌ సినిమాకు చాలా కీలకం కానుండటంతో మరో ఆలోచన లేకుండా నిర్మాతలు దీనిని పున:నిర్మించే ఆలోచనలో పడ్డారట. ఈ వర్షాలు తగ్గిన వెంటనే తిరిగి సెట్‌ను నిర్మించే పనులు చేపట్టాలని మేకర్స్‌ నిర్ణయించినట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. కాగా అల్లుడు శీను సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయిన బెల్లంకొండ శ్రీనివాస్‌కు ఇప్పటిదాకా ఒక్క పెద్ద హిట్‌ కూడా పడలేదు. దీంతో రీమేక్‌ చిత్రాలనే నమ్ముకొని సినిమాలు చేస్తున్నాడు. తమిళ రీమేక్‌ రాక్షసుడు అనంతరం ప్రస్తుతం బెల్లంకొండ చేస్తోన్న రీమేక్‌ చిత్రం ఛత్రపతి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్‌ సాధించిందో ప్రత్యేకంగా చెప్పానక్కర్లేదు. ఈ మూవీతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న బెల్లంకొండ సరసన అనన్య పాండే నటిస్తున్నట్లు సమాచారం.

చదవండి: 
ఛత్రపతి రీమేక్‌లో సాయి శ్రీనివాస్‌

మరిన్ని వార్తలు