మమ్మమ్మాస్‌ ఎంట్రీ షురూ

12 Nov, 2020 00:41 IST|Sakshi
బెల్లంకొండ శ్రీనివాస్

ప్రభాస్‌ని మంచి మాస్‌ హీరోగా నిలబెట్టిన చిత్రాల్లో ‘ఛత్రపతి’ (2005) ఒకటి. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ భారీ వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఈ చిత్రం హిందీలో రీమేక్‌ కానుంది. హీరోగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ నటించనున్నారు. ‘అల్లుడు శీను’ చిత్రంతో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు నిర్మాత బెల్లంకొండ సురేశ్‌ తనయుడు సాయిశ్రీనివాస్‌. తన ప్రతి చిత్రాన్ని హిందీలోకి డబ్బింగ్‌ చేసుకుంటూ వచ్చారు. అలా డబ్బింగ్‌ సినిమాల ద్వారా బాలీవుడ్‌లో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు శ్రీను. ఇప్పుడు డైరెక్ట్‌ సినిమాతో హిందీ తెరపై కనిపించాలనుకున్నారు. మంచి మాస్‌ కథాంశంతో రూపొందిన ‘ఛత్రపతి’ రీమేక్‌ అయితే బాగుంటుందనుకున్నారు. ఈ రీమేక్‌ కోసం ఓ ఫోటోషూట్‌ చేశారట సాయి. బాలీవుడ్‌కి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి ఇంకా దర్శకుడు ఖరారు కాలేదు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు