కాజల్‌ పెళ్లికి వెళ్లనున్న టాలీవుడ్‌ యంగ్‌ హీరో

22 Oct, 2020 14:52 IST|Sakshi

2014లో విడుదలైన అల్లుడు శీను సినిమాతో టాలీవుడ్‌ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు బెల్లంకొండ శ్రీనివాస్‌. వివి వినాయక్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించారు. ఆ తర్వాత జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా స్పీడున్నోడు, జయ జానకి నాయక, సాక్ష్యం, కవచం, సీత, రాక్షసుడు వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం ‘అల్లుడు అదుర్స్’‌ అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఆ హీరో తన బెస్ట్‌ ఫ్రెండ్‌ పెళ్లికి హాజరవుతున్నట్లు వెల్లడించారు. ఆ బెస్ట్‌ ఫ్రెండ్‌ ఎవరో కాదు తనతోపాటు రెండు చిత్రాల్లో కలిసి నటించిన కాజల్‌ అగర్వాల్‌. చదవండి: పెళ్లి డేటు చెప్పిన కాజల్‌ అగర్వాల్‌

కాజల్ అగర్వాల్‌, శ్రీనివాస్‌ మంచి స్నేహితులు. కాబట్టి ఆమె పెళ్లికి హాజరుకాబోతున్న అతిథులలో తాను కూడా ఒకడిని అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ పెళ్లి నాటికి వీలు చేసుకొని తప్పక ముంబై వెళతానని స్పష్టం చేశారు. ‘కాజల్ నా బెస్ట్ ఫ్రెండ్. ఆమె నా కుటుంబంలోని వ్యక్తితో సమానం. కాజల్‌కు మంచి జీవిత భాగస్వామి దొరకడం సంతోషంగా ఉంది. గౌతమ్ గొప్ప వ్యక్తి. వారిద్దరికీ నా శుభాకాంక్షలు. నేనిప్పుడు షూటింగ్‌లో ఉన్నాను. కానీ విరామం తీసుకుని కాజల్ పెళ్లికి హాజరు కావాలి. మిగిలిన పనుల కోసం తన పెళ్లి మిస్ చేయలేను’ అంటూ పేర్కొన్నారు. చదవండి: ఇల్లు సర్దుతున్నాం.. ఎనీ సజేషన్స్‌?

కాగా టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ నెల 30న ముంబైకు చెందిన బిజినెస్‌మెన్ గౌతమ్ కిచ్లును వివాహామాడనున్నారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా అతితక్కువ మంది బంధువులు సమక్షంలో ముంబైలో ఈ వేడుక జరగనుంది. అంతేగాక కేవలం 20 మందిని మాత్రమే పెళ్లికి ఆహ్వానించినట్లు తెలుస్తుంది. మరోవైపు కాజల్‌ ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో ఫీమేల్‌ లీడ్‌ రోల్‌ చేస్తున్నారు. పెళ్లి తర్వాత రెండు వారాల తర్వాత తిరిగి షూటింగ్‌లో పాల్గొననున్నారు. చదవండి: ‘అల్లుడు అదుర్స్’‌లోకి సోనూ సూద్‌ ఎంట్రీ

మరిన్ని వార్తలు