కశ్మీరులో చిక్కుకున్న బెల్లంకొండ

7 Jan, 2021 20:42 IST|Sakshi

బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న 'అల్లుడు అదుర్స్‌' బృందం చివరి పాట చిత్రీకరణ కోసం కశ్మీర్ కు వెళ్లారు. షూటింగ్ ముగించుకుని వస్తున్న క్రమంలో కశ్మీరులో మంచు తుఫాను కురుస్తున్న కారణంగా హీరోతో పాటు చిత్రబృందం అక్కడే చిక్కుకుంది. విమాన రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. గత కొన్ని రోజులుగా శ్రీనగర్, కశ్మీర్ లోని ఇతర ప్రాంతాల్లో భారీ హిమపాతం కురుస్తుంది. ప్రత్యేక విమానం ద్వారా కూడా హీరో హైదరాబాద్‌కు చేరుకోలేని పరిస్థితి ఉంది. రేపు(జనవరి 8న) సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు అన్ని ఏర్పాట్లు చేసుకోగా ఇప్పుడు హీరో  వస్తాడా రాడా అనే విషయంలో పెద్ద సందేహం నెలకొంది. ప్రీ రిలీజ్ వేడుకను వాయిదా వేయాలన్న ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తుంది. సంతోష్ శ్రీనివాస్ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతికి జ‌న‌వ‌రి 15న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.(చదవండి: రికార్డుల మోత మోగిస్తోన్న స్టైలిష్‌ స్టార్‌)

   

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు